సమంత కోరిక తీర్చిన అసిస్టెంట్!
హైదరాబాద్ : సెలబ్రిటీలకు, ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న వారికి ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. వీరు బయట కనిపిస్తే ఇక అంతే. అందుకే సెక్యూరిటీ లేకుండా బయటకు రావడానికి చాలా మంది భయపడతారు. ఇలాంటి పరిస్థితుల కారణంగా కొన్ని చిన్న చిన్న సరదాలు తీర్చుకోలేక పోతారు.
అలాంటి పరిస్థితే హీరోయిన్ సమంతది. ఆమెకు బైక్‌పై హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టాలని బోలెడు ఆశ. మరి సమంత అలా రోడ్లపైకి బైక్‌పై వస్తే హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జాం ఖాయం. అందుకే ఎవరూ గుర్తుపట్టకుండా ముసుగేసుకుని ఈ కోరిక తీర్చుకుంది సమంత.

ఇంతకీ సమంత కోరిక తీర్చింది ఎవరో తెలుసా? ఇంకెవరు ఆమె అసిస్టెంటే. సమంత వద్ద సహాయకుడిగా పని చేస్తున్న ఆర్య అనే వ్యక్తి సమంతను బైక్‌పై హైదరాబాద్ రోడ్లపై తిప్పాడట. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ ద్వారా బయట పెట్టింది. ఆర్య అంటే మీరేదో ఊహించుకోవద్దు.....అతడు నా సహాయకుడు అని రూమర్లకు తావులేకుండా క్లారిటీ ఇచ్చింది సమంత.
సమంత నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం త్వరలో ఆగస్టు 7న విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఆమె పలు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం', 'రామయ్యా వస్తావయ్యా', 'రభస'తో పాటు మరో రెండు చిత్రాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











