Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘దూకుడు’ డాన్సింగ్ స్టైల్ గురించి అదరగొడుతోంది..?
సినిమా ఇండస్ట్రీలో నటన పరంగా, డ్యాన్సుల పరంగా హీరోలకి పోటీ అనేది సహజం..అయితే హీరోయిన్స్ లో కూడా ఈ మధ్య పోటీ అనేది హీరోలకు ధీటుగా పెరుగుతోంది. అందుకు నిదర్శనం బద్రీనాథ్ సినిమాలో తమన్నా అల్లు అర్జున్ తో పాటు డ్యాన్సులు ఇరగదీసింది..అయితే తాజాగా మరో హీరోయిన్ తనను తాను చాలా గొప్ప డాన్సర్ గా అభివర్ణించుకుంటోంది సెక్సీభామ సమంత. 'ఏమాయ చేసావె" సినిమాలో డాన్స్ చేసే అవకాశం పెద్దగా రాకపోయినా, 'బృందావనం సినిమాలో మాత్రం అవకాశం వున్నంతవరకూ డాన్సుల్లో దుమ్మురేపేసింది.
అయితే, బృందావనం"లో కొన్ని పాటల్ని కాజల్ లాగేసుకోవడంతో సమంతకి డాన్సుల పరంగా నిరుత్సాహమే మిగిలింది. ఇప్పుడా టెన్షన్ తనకు లేదంటోంది సమంత 'దూకుడు" సినిమా గురించి చెబుతూ..'దూకుడు" లో డాన్సులకు తోడు..వెరైటీ స్టెప్పులూ సిమాలో చాలా వున్నాయని సమంత చెబుతోంది. 'దూకుడు" తనకు పూర్తిస్థాయిలో సంతృప్తినిచ్చిన చిత్రమనీ, టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా 'దూకుడు" నిలిచిపోతుందనే ధీమా వ్యక్తం చేస్తోంది సమంత.
ఈనెల చివరి వారంలో విడుదలకాబోతోన్న 'దూకుడు" పై ఇటు మహేష్, అటు సమంతలు పబ్లిసిటి స్టంట్స్ అదరగొడుతుంటే ట్రేడ్ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ పలు రకాల అంచనాలు చోటు చేసుకున్నాయి. ఈ సినిమాలో అజయ్ ఐపియస్ గా, మహేష్ నటిస్తున్నాడని సమాచారం. ప్రశాంతిగా సమంత నటిస్తోందట. అజయ్ వర్మగా 'ఒక్కడు" సినిమాలో నటించాడు మహేష్ బాబు. ఇప్పుడు మళ్లీ అజయ్ ఐపియస్ అనే పేరుతో దూకుడు సినిమాలో నటించాడు. అజయ్ పేరుతో రూపొందిన 'ఒక్కడు" పెద్ద హిట్ చిత్రం. ఇప్పుడు 'దూకుడు" కూడా ఒక్కడు" అంత పెద్ద హిట్ అవుతుందని మహేష్ అభిమానులు కొంతమంది చెబుతున్నారు.