పెళ్లి తర్వాత ఊహించని నిర్ణయం, ‘యూ టర్న్’ తీసుకుంటున్న సమంత!
Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత ఇటీవలే తన ప్రియుడు నాగ చైతన్యతో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని ముందే ప్రకటించిన సమంత పెళ్లికి ముందే కమిటైన పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
కాగా... పెళ్లి తర్వాత సమంత ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. నిర్మాతగా సినిమా చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు 'యూటర్న్' అనే కన్నడ సినిమా రైట్స్ కొనుగోలు చేసి దాన్ని తెలుగులో తీసేందుకు ప్లాన్ చేస్తోంది.

తెలుగులోనూ వర్కౌట్ అవుతుందని సమంత నమ్మకం
కన్నడంలో చిన్న సినిమాగా విడుదలైన ‘యూటర్న్' అక్కడి బాక్సాఫీసు వద్ద పెద్ద విజయం సాధించింది. `యూటర్న్`ను తెలుగులో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా బాగా వర్కౌట్ అవుతుందని సమంత నమ్ముతుంది.

సమంతకు సపోర్టుగా నాగార్జున
నిర్మాతగా మారాలనే సమంత ఆలోచనకు మామయ్య నాగార్జున సపోర్టు కూడా ఉంది. ‘యూటర్న్' చిత్రాన్ని తెలుగులో రూపొందిస్తే రిలీజ్ విషయంలో తన పూర్తి సహకారం ఉంటుందని నాగార్జున హామీ ఇచ్చారట.

దర్శకత్వం అతడే...
కన్నడ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన పవన్‌కుమార్ తెలుగులో తెరకెక్కనున్న చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నాడు. ‘యూ టర్న్' మూవీ డీల్ కోసం తన భర్త నాగచైతన్యతో కలిసి ఇటీవల బెంగళూరు వెళ్లిన సమంత సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చిందట. దర్శకుడితో కూడా చర్చించింది.

యూటర్న్ లో జర్నలిస్టు పాత్రలో సమంత
‘యూటర్న్' సినిమాలో సమంత కూడా నటించనుంది. ఇందులో ఆమె జర్నలిస్టు పాత్రలో కనిపించనుందని సమాచారం. తెలుగు, తమిళంలో ద్విబాషా చిత్రంగా దీన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కన్నడలో సూపర్ హిట్
‘యూటర్న్' మూవీ కన్నడలో 2016లో విడుదలైంది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రోగర్ నారాయణ్, దిలీప్ రాజ్, రాధికా చేతన్ ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ చిత్రం అక్కడ మంచి విజయం సాధించింది.


Click it and Unblock the Notifications











