»   » అభిమానం హద్దులు దాటింది..భాదపడుతూ వెళ్లిపోయిన సమంత!

అభిమానం హద్దులు దాటింది..భాదపడుతూ వెళ్లిపోయిన సమంత!

Subscribe to Filmibeat Telugu
Samantha Face Bad Incident In Anantapur భాదపడుతూ వెళ్లిపోయిన సమంత!

సినీతారలు ఎక్కడ కనిపించినా అభిమానుల్లో పెద్దఎత్తున ఉత్సాహం కనిపిస్తుంది. ఆ ఉత్సాహం, అభిమానం హద్దులు దాటుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా టాలీవుడ్ లో సినీతారలంటే అభిమానులు వెర్రెత్తిపోయే అభిమానాన్ని ప్రదర్శిస్తారు. పిచ్చి అభిమానం వలన అటు సినీతారలకు, అభిమానులకు ఇబ్బందికర ఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘటనే హీరోయిన్ సమంతకు అనంతపురంలో ఎదురైంది. అభిమాని ప్రదర్శించిన అత్యుత్సాహం వలన అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది.

సినీతారలంటే అభిమానం

సినీతారలంటే అభిమానం

సినీతారలంటే అభిమానుల్లో ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది.వెండి తెరపై అభిమాన నటులు చేసే డాన్సులు, విన్యాసాలు చూసి ఫాన్స్ వెర్రెత్తిపోతారు.సినీతారలు బయట కనిపించినా అదే తరహాలో అభిమానాన్ని ప్రదర్శిస్తారు.

హద్దులు దాటుతున్న అభిమానం

హద్దులు దాటుతున్న అభిమానం

ఇటీవల అభిమానం హద్దులు దాటుతున్న దృశ్యాలు ఘటనలు చూస్తూనే ఉన్నాం. హీరోల ఫాన్స్ ప్రదర్శించే అత్యుత్సాహం వలన టాలీవుడ్ లో కొన్ని వివాదాలు సైతం నెలకొన్నాయి. ఇలాంటి ఘటనల వలన సినీతారలకు ఇటు అభిమానులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే.

అనంతపురంలో సమంత

అనంతపురంలో సమంత

సమంత తాజాగా అనంతపురం జిల్లాలో మెరిసింది. ఓ మొబైల్ షోరూం ఓపెనింగ్ సందర్భంగా సమంత అనంతకు వెళ్ళింది. సమంత కోసం అభిమానులు ఎగబడ్డారు.

దూసుకొచ్చిన అభిమాని, చేదు అనుభవం

దూసుకొచ్చిన అభిమాని, చేదు అనుభవం

ఓ అభిమాని సమంతని చూడాలనే మితిమీరిన ఉత్సహంతో దూసుకొచ్చాడు. దీనితో అక్కడ స్వల్ప తోపులాట జరిగింది. అతడిని నిలువరించే క్రమంలో పోలీస్ లు అతడిపై లాఠీ ఛార్జ్ చేసారు.

 సమంత మనస్తాపం

సమంత మనస్తాపం

అనుకోకుండా జరిగిన ఘటనతో సమంత మనస్తాపం చెందింది. కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

Read more about: samantha akkineni సమంత
English summary
Samantha face bad incident in Anantapur. Samantha fan beaten by police
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu