సమంత స్టిల్స్ పోస్టర్స్ పై వేసి మోసం చేసారు
'ఏ మాయ చేశావె" చిత్రంతో తెలుగునాట స్టార్ గా ఓవర్ నైట్ లో ఇమేజ్ తెచ్చుకున్న లక్కీ గర్ల్ సమంత. ఆమె క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని ఆమెకు క్రేజ్ తెప్పించిన గౌతమ్ మీనన్ ప్లాన్ చేసారు. ఆయన తాజా చిత్రం 'ఎర్ర గులాబీలు" లో క్లైమాక్స్ లో కొద్ది క్షణాలు మాత్రం ఆమెను చూపి పోస్టర్స్ లో ఆమెను హైలెట్ చేసారు.దాంతో ఆమె ఫ్యాన్స్ పాపం పరుగెత్తుకు వెళ్ళారు. కానీ చిత్రంలో ఆమె పాత్ర కేవలం రెండు మూడు నిముషాలు మాత్రమే ఉంది. దీంతో నిరాశపడిన సమంత అభిమానులు గౌతంమీనన్ తమను మోసం చేసాడని తిడుతున్నారు. అంతేగాక కేవలం కొద్ది క్షణాలు మాత్రమే కనిపించే పాత్రను ప్రత్యేకంగా ప్రతి పోస్టర్‌లో వేయాల్సిన అవసరం ఏమిటి అంటున్నారు. సైకో ధ్రిల్లర్ గా విడదలైన ఈ డబ్బింగ్ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











