అనుష్కను ఫాలో అవుతున్నా: సమంత
తెరపై అనుష్కను ఎంత అభిమానిస్తానో... బయట అంతకు మంచి ఆమెను ఆరాధిస్తాను. అందుకే నలుగురిలో నా నడవడిపై అనుష్క ప్రభావం చాలా ఉంది అంటోంది సమంత. సమంత రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది. ఇక ప్రస్తుతం అనూష్క వరస ఆఫర్స్ తో బిజీగా ఉంది. దూకుడు సూపర్ హిట్ కావటంతో ఆమెను ప్రతీ స్టార్ హీరో తన సినిమాలోకి తీసుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆమె రాజమౌళి ఈగ,గౌతమ్ మీనన్ పేరు పెట్టని చిత్రంలోనూ చేస్తోంది.
అలాగే నాగచైతన్య సరసన మరోసారి ఆటో నగర్ సూర్య చిత్రంలోనూ చేస్తోంది. ఆమెను త్వరలో రామ్ చరణ్ చిత్రంలోనూ చేసే అవకాశం ఉందని వార్తలు వినపడుతున్నాయి. ఇక ఏమి మాయ చేసావే చిత్రంతో పరిచయమైన సమంత ఆ తర్వాత చేసిన బృందావనం విజయం సాధించటంతో దూకుడుతో హాట్రిక్ కొట్టినట్లైంది.కానీ తమిళంలో మాత్రం ఆమె సినిమమాలు ఆడటం లేదు. గౌతమ్ మీనన్ తో చేస్తున్న చిత్రంపై ఆమె నమ్మకం పెట్టుకుని ఉంది. ఆ చిత్రం తమిళంలోనూ ఆమెకు క్రేజ్ తెచ్చి పెడుతుందని భావిస్తోంది.


Click it and Unblock the Notifications











