ఆ డైరెక్టర్-హీరోయిన్ కలిసి మళ్లీ మాయ చేస్తారట...
'ఏ మాయ చేసావె" తో తెలుగు పరిశ్రమకు ఓ కొత్త నాయికను పరిచయం చేశారు గౌతమ్ వాసుదేవ మీనన్. ఆ సినిమా తరువాత సమంత నాయికగా దూసుకుపోతోంది. నాగచైతన్యకు తొలి విజయం అందించింది కూడా ఈ చిత్రమే. గౌతమ్-సమంత మళ్లీ మాయ చేయడానికి సిద్దమయ్యారు. సమంత, సమీరా రెడ్డి కథానాయి కలుగా గౌతమ్ మీనన్ దర్శ కత్వంలో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్క నుంది. మనదేశం మూవీస్ పతాకంపై ప్రముఖ ఫైనాన్షియర్ అశోక్ వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సినిమా విశేషాల గురించి నిర్మాత మాట్లాడుతూ 'సమంత- గౌతమ్‌మీనన్ కాంబినేషన్‌లో 'ఏ మాయచేశావె" లాంటి హిట్‌చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ ఇరువురి కలయికలో ఉర్రూతలూగించే కథాంశంతో ఓ సినిమా రూపొందించనున్నాం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకా లంలో తెరెక్కుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు నడుస్తున్నాయి. గౌతమ్ మీనన్ తనదైన శైలిలో చిత్రాన్ని తెరకెక్కిం చడానికి కసరత్తు చేస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు తెలుస్తాయి" అన్నారు.


Click it and Unblock the Notifications











