కంట్రోలు చేసుకోలేక... సమంత మళ్లీ ట్వీట్టర్ లో...

By Srikanya

హైదరాబాద్: హీరోయిన్ సమంత కొంత కాలం పాటు ట్విట్టర్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సమంత దాన్ని పది రోజులు పాటు కూడా దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. తాజాగ ఆమె తెలుగు ఇండస్ట్రీలో ఐదు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఓ ట్వీట్ రాసింది. సమంత ట్వీట్ లో... "నా ఏమి మాయ చేసావే చిత్రం రిలీజై అప్పుడే ఐదు సంవత్సరాలు గడిచిపోయింది. ఏమి మాయ చేసావే..ఓ స్పెషల్ సినిమా. ఇదంతా ఓ అద్బుతమైన ప్రయాణం. ఇక్కడ ఉన్నందుకు చాలా ఆనందంగనూ గర్వంగానూ ఉంది," అంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘కొంత కాలం పాటు ట్విట్టర్ కు దూరంగా ఉంటున్నాను. గాడ్ బ్లెస్ యు. అందరూ బావుండాలి' అంటూ ఆమె ట్వీట్ చేసింది. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత ఇలా చేయడంతో ఫ్యాన్స్ అప్ సెట్ అయ్యారు. పలువురు అభిమానులు రిక్వెస్ట్ చేసినా ఆమె నుండి మాత్రం ఎలాంటి రిప్లై రాలేదు.

Samantha gets back to Twitter

సుమారు పది లక్షల మంది ఫాలోవర్లు ఉన్న తన ట్విట్టర్ అకౌంట్ ను కొంతకాలం పాటూ క్లోజ్ చేసేస్తున్నట్లు స్వయంగా సమంతనే ట్వీట్ చేసింది. అయితే... లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ సిద్ధార్ధ్ తో బ్రేక్ అప్ అయినందునే అమ్మాయి ట్విట్టర్ కు దూరంగా జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు... కొద్ది కాలం పాటు కాంట్రవర్శీలకు దూరంగానూ ఉండాలని సంమత నిర్ణయించుకుందని సన్నిహితులు చెబుతున్నారు. ఏదేమైనా... సమంత ట్విట్టర్ కు దూరంగా ఉండటం .... ఆమె అభిమానుల్ని నిరాశకు గురిచేస్తోంది అనుకునే లోగా ఇలా కనిపించటం అందరి ఆనందానికి కారణమైంది.

ఆ మధ్య సమంత ఆరోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈగ తర్వాత ఆమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. అప్పుడు చాలా ప్రాజెక్టులు ఆమెకు దూరం అయ్యాయి. అయితే సమంత అనారోగ్యం మళ్లీ తిరగబెట్టిందని, అందుకే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉందని, అందుకే ముందుగా ట్విట్టర్ కు స్వస్తి చెప్పిందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే అసలు విషయం ఏదో తెలియక....ఈ పుకార్లు జీర్ణించుకోలేక అభిమానులు అయోమయంలో పడ్డారు. మరి అభిమానుల్లో అయోమయం తొలగించడానికి సమంత ఏదైనా ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X