twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంటెక్కిపోతోందంటూ సమంత ట్వీట్

    By Srikanya
    |

    హైదరాబాద్: హాట్ సమంత ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో జబర్ధస్త్ చిత్రం చేస్తోంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం నిమిత్తం ఆమె మలేషియాలోని లంగక్విలో ఉంది. అక్కడ వాతావరణం ఆమెను చాలా ఇబ్బంది పెడుతోంది. దాంతో ఆమె అక్కడ ఏ పనిచేయలేకపోతోందిట. ఈ విషయాన్ని ఆమె ట్వీట్ చేస్తూ... "లంగక్వి వాతావరణం నన్ను డీప్ గా ప్రై చేసేస్తోంది. నా పరిస్తితి బాగా వేడిగా ఉన్న పెనం మీద ఉన్నట్లుంది. ఇది నా ఫేవెరెట్ ప్లేస్ గా ఎప్పుటికీ కాదు. ఎప్పుడు ఇంటికి తిరిగి వచ్చేస్తానా అని ఎదురుచూస్తున్నా..." అంది.

    సమంత వరసగా సినిమాలు బుక్ అవుతోంది. ఇదే బ్యానర్ లో ఆమె ఎన్టీఆర్ సరసన బుక్కైంది. కందిరీగ దర్శకుడు డైరక్ట్ చేసే చిత్రంలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే... బెల్లంకొండ కుమారుడు హీరోగా వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలోనూ ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసారు. మరో ప్రక్క ఆమె త్రివిక్రమ్ దర్సకత్వంలో పవన్ సరసన నటించబోతోంది.

    ఇక చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. కాల్షీట్లు సర్దుబాటు చేయలేక కొన్ని సినిమాల్నీ వదులుకొంది. ఈ సంక్రాంతికి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విడుదల కానుంది. సమంత మాట్లాడుతూ ''విజయాలు చూసి తల ఎగరేసే తత్వం కాదు నాది. ఇక్కడికి వచ్చిన తరవాత నా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పూ రాలేదు. ఎప్పట్లా పాత సమంతనే. స్నేహాలు పెరిగాయి. కానీ పాత మిత్రుల్ని మాత్రం వదులుకోలేదు. షూటింగ్‌ లేదంటే.. చిన్ననాటి, కళాశాల మిత్రులతో సందడి చేస్తా. 'నువ్వేం మారలేదు..' అని చెప్తుంటారు. ఎందుకు మారాలి? ఎప్పటికీ నిలిచిపోయేవి అనుబంధాలే. హోదా, పరపతి ఎప్పుడూ శాశ్వతం కాదు'' అని చెప్పింది.

    ''ఒకటో స్థానం నా లక్ష్యం కాదు. కష్టపడి పని చేస్తా. నేను ఏ స్థానానికి అర్హురాలినో పరిశ్రమకూ, ప్రేక్షకులకూ తెలుసు. మనసులో ఒక లక్ష్యం ఉన్నప్పుడు మరో ఆలోచన మనసులోకి రాదు. ఇప్పుడు నా గురి పూర్తిగా సినిమాలపైనే. ప్రస్తుతానికి నా జీవితంలో మిగతా విషయాలకు చోటు లేదు'' అంటోంది సమంత.

    English summary
    Samantha tweeted.... “Langkawi errrr.. So not on my top ten places to be…new on the menu ‘deep fried me on a stick’ grrr.. Can’t wait to cm back home,” she posted on Twitter. Nandini Reddy is directing this film and it stars Siddharth, Samantha and Nithya Menon in lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X