ఎన్టీఆర్ సినిమాకు సమంత రేటు పెంచేసిందిరోయ్!
హైదరాబాద్: తమన్నా, అనుష్క, త్రిష, ఇలియానా.... ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో కోటికిపైగా భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న తారలు. తాజాగా ఈ లిస్టులో సెక్సీ హీరోయిన్ సమంత కూడా చేరిపోయింది. ఇటీవల ఆమె నటించిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రంలో తన నటనకు మంచి మార్కులు పడటంతో... త్వరలో జూ ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు ప్రస్తుతం తీసుకుంటున్న దానికంటే ఎక్కువ డిమాండ్ చేస్తోంది.
ఈగ సినిమా విజయవంతం కావడంతో సమంతకు డిమాండ్ బాగా పెరిగి పోయింది. ఇదే అదునుగా రేటు పెంచేయాలని నిర్ణయించుకుంది ఈ చెన్నయ్ చిన్నది. ఆమె త్వరలో జూ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు రూ. 1.25 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె సన్నిహితులు మాత్రం రేటు పెంచినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని అంటున్నారు.
సమంత సినిమాల విషయానికొస్తే..
గౌతం మీనన్ దర్శకత్వంలో సమంత నటించిన 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రం నిన్న విడుదలై బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సమంత తొలిసారిగా ప్రస్తుతం తాను నటిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి గాను సొంత డబ్బింగ్ చెప్పుకుంటోంది.
ప్రస్తుతం ఆమె నాగ చైతన్యతో కలసి దేవాకట్ట దర్శకత్వంలో 'ఆటోనగర్ సూర్య', మహేష్ బాబుతో కలిసి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', సిద్ధార్థతో కలిసి నందిని రెడ్డి దర్శకత్వంలో 'డుండుం పీపీ' అనే చిత్రంలో, పవన్ కళ్యాణ్ తో కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సానిమాకు, జూ ఎన్టీఆర్-హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకు కమిట్ అయింది. రామ్ చరణ్ తేజతో కలిసి ఆమె 'ఎవడు' చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైనప్పటికీ.... కొన్ని అనుకోని కారణాలతో ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి అర్ధాంతరంగా తప్పించారు. 'ఈ సారి డేట్స్ ప్రాబ్లం మాత్రం కాదు.... ఓ వ్యక్తి తనను కావాలని సినిమా నుంచి బయటకు తప్పించాడు' అని సమంత ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











