twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాయ్ ఫ్రెండ్, లవ్ ఎఫైర్, పెళ్లి గురించి... సమంత ఇలా!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హాట్ లేడీ సమంతపై ఈ మధ్య రూమర్లు తెగ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సమంత కనిపించినంత అమాయకురాలు కాదని... తెర వెనక చాటు మాటు ప్రేమ వ్యవహారాలు నడిపిస్తోందని సదరు రూమర్ల సారాంశం. తన కోస్టార్ సిద్ధార్థతో డేటింగ్ చేస్తోందనే వార్తలను ఇటీవల ఖండించిన సమంత తనపై ఎలాంటి పుకార్లు వెలువడకుండా స్పష్టమైన వివరణ ఇచ్చింది. తన సీక్కెట్ ప్రేమ, పెళ్లి వివరాలను బట్ట బయలు చేసింది.

    ఇటీవల ఆమె ఓ మూవీ పోర్టల్‌తో మాట్లాడుతూ... తన పర్సనల్ లైఫ్ గురించి చర్చించింది. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం ఒప్పేసుకుంది. 'అవును నేను ప్రేమలో ఉన్నాను' అని వ్యాఖ్యానించింది. అయితే తన ప్రియుడు ఎవరనే విషయం బయట పెట్టడానికి మాత్రం సమంత నిరాకరించింది. తన ప్రేమ వ్యవహారం పూర్తిగా ప్రైవేట్ మ్యాటరని, దాని గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ మరో మూడు సంవత్సరాల తర్వాత అని వెల్లడించింది.

    ఇక సమంత సినీ జీవితం విషయానికొస్తే.... 2010లో 'ఏ మాయ చేసావె' చిత్రం ద్వారా సినిమాల్లోకి తెరంగ్రేటం చేసిన సమంత ఆ సినిమా విజయం సాధించడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ఆమో తెలుగు, తమిళం బాషల్లో దాదాపు 10 సినిమాల వరకు చేసింది. దాదాపు అన్ని సినిమాలు విజయం సాధించాయి. దీంతో సమంత లక్కీ హీరోయిన్ గా మారి పోయింది. స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు ఆమె ఉంటేనే సినిమా చేస్తాం అనే పరిస్థితి తయారైంది.

    English summary
    In her recent chat with a movie portal, Samantha gushed on her personal life. The actress says that she is 25-year-old and she deserves to have a boyfriend. She says, "I'm in love." But she declines to divulge any details about her boyfriend. She would like to keep her love life as private affair. Meanwhile, she adds, "I'd like to marry in three more years."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X