ఈ దసరాకు ఆ అదృష్టం లేదు: సమంత
ఈ దసరాకు కుటుంబంతో గడిపే అదృష్టం తనకు లేదని, షూటింగులతో బీజీగా ఉండటం కారణంగా ఇంటికి వెళ్లలేక పోతున్నానని సెక్సీ హీరోయిన్ సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం 'బిగ్ సి"కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సమంత దానికి సంబంధించిన కార్య్రకమంలో పాల్గొనడానికి మంగళవారం హైదరాబాద్ వచ్చింది. ఆ సంస్థ నిర్వహించిన లక్కీడ్రాలో గెలుపొందిన వారికి స్వయంగా ఫోన్ చేసి బహుమతి వివరాలను తెలియ జేసింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమంత ఉత్సాహంగా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఈగ అనే సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించింది. దూకుడు సినిమా హిట్ కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది.
ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయని, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలనేది తన లక్ష్యమని, నన్ను ఇలాగే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానని, త్వరలోనే తెలుగు బాషపై పూర్తి పట్టు సాధిస్తానని స్పష్టం చేసింది. కాగా..దూకుడు సినిమా హిట్ తో సమంత తన రెమ్యూనరేసన్ ఏకంగా రూ. కోటి పైన పెంచేసింది. వేడి ఉన్నప్పుడే వాడుకోవాలనే ఆలోచనతో తనకు క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











