మహేష్ ‘దూకుడు’తో హ్యాట్రిక్ కొట్టిన బ్యూటీ సమంత..!
'ఏ మాయ చేసావె' సినిమాతో తెలుగు నాట అడుగుపెట్టిన చెన్నయ్ సోయాగాల సుందరి సమంతా ఆ ఒక్క సినిమాతోనే... అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె తొలి సినిమా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ, సమంతాకు మాత్రం ఆఫర్లు వచ్చిపడ్డాయి. స్టార్ హీరోలంతా సమంతానే కావాలంటూ తమ దర్శక నిర్మాతలకు చెప్పేశారు. ఆ తర్వాత వచ్చిన 'బృందావనం' సక్సెస్ ఆమెను మరో మెట్టు పైకెక్కించింది. కాజల్, అనుష్క వంటి హీరోయిన్లకు పోటీ ఇచ్చే స్థాయికి ఆమె వచ్చేసింది.
విశేషమేమిటంటే, తాజాగా ముచ్చటగా మూడో సినిమా 'దూకుడు' కూడా హిట్ కావడం! ఈ సినిమా విడుదల రోజు సమంతా రిపోర్ట్ కోసం టాలీవుడ్ లోని పలువురు స్నేహితులకు ఫోన్లు చేస్తూ తెగ టెన్షన్ పడిందట. 'హిట్ టాక్' అని చెప్పగానే ఊపిరి పీల్చుకుని హ్యాపీ అయిందట. ఇలా వరుసగా హ్యాట్రిక్ సక్సెస్ పొందడంతో సమంతా ఇప్పుడు తన రేటు పెంచే ఆలోచన చేస్తోందని టాలీవుడ్ సమాచారం.
'దూకుడు" సినిమాలో మహేష్ బాబు సరసన అవకాశం దక్కించుకోవడం ఏమోగానీ....హీరోయిన్ సమంత ప్రవర్తనలో కూడా దూకుడు తనం పెరిగి పోయింది. నిన్న మొన్నటి వరకు సినిమా రూ. 40 నుంచి 60 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే ఈ భామ...దూకుడు సినిమా హిట్టయితే తన రెమ్యూనరేషన్ ను ఏకంగా రూ. కోటి రూపాయలకు పెంచే ఆలోచనలో ఉందటసక్సెస్ లో వున్న చక్కనమ్మ ఎంత పెంచినా కూడా ఇవ్వడానికి మన నిర్మాతలెప్పుడూ రెడీగానే వుంటారు కదా?


Click it and Unblock the Notifications











