»   » నొప్పితో బాధపడుతున్న సమంత ఇలా...(ఫోటో)

నొప్పితో బాధపడుతున్న సమంత ఇలా...(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాట్ హీరోయిన్ సమంత తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో సోషల్ నెట్వర్కింగు ద్వారా షేర్ చేసుకుంటోంది. తాజాగా తలనొప్పితో బాధపడుతున్నపుడు తన పరిస్థితి ఎలా ఉందో చూపించేలా ఓ ఫోటోను పోస్టు చేసింది. ఆ ఫోటోలో సమంత బాధను చూసి కొందరు అభిమానులు తమ బాధలా ఫీలై విలవిలాడి పోతున్నారు.

సమంత సినిమాల వివరాల్లోకి వెళితే.. 'అత్తారింటికి దారేది' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఆమె పలు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం', జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'రామయ్యా వస్తావయ్యా', 'రభస'తో పాటు మరో రెండు చిత్రాలు చేస్తోంది.

<blockquote class="twitter-tweet blockquote"><p>Migraine since the afternoon.... Boo hoo... Unbearable <a href="http://t.co/c0VDSeulw8">pic.twitter.com/c0VDSeulw8</a></p>— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) <a href="https://twitter.com/Samanthaprabhu2/statuses/369466904181624832">August 19, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ బిజీగా గడుపుతోంది సమంత. ప్రత్యూష ఫౌండేషన్ కోసం నిధులు సేకరిస్తోంది. ఇందులో భాగంగా సినిమాల్లో ఉపయోగించిన పాపులర్ సినీ స్టార్స్ డ్రెస్సులను వేలం వేసి, తద్వారా వచ్చే డబ్బును 'ప్రత్యూష ఫౌండేషన్' కోసం విరాళంగా ఇచ్చేందుకు ప్లాన్ చేసారు.

తొలి వేలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ 'గబ్బర్ సింగ్'లో పవన్ ధరించి పోలీస్ యూనిఫాంను వేలానికి పెట్టనున్నారు. త్వరలో వేలం ఎక్కడ జరుగుతుంది? బిడ్డింగ్ ధర ఎంతతో మొదలవుతుంది? అనే విషయాలు వెల్లడించనున్నట్లు సమంత ట్విట్టర్లో పేర్కొంది.

ప్రత్యూష ఫౌండేషన్లో సమంతతో పాటు డాక్టర్లు మంజుల, శైలేష్, పమేలా ఈ ఆర్గనైజేషన్ కోసం పని చేస్తున్నారు. పిల్లలు, మహిళ సాధికారత కోసం ఈ ఆర్గనైజేషన్ పని చేస్తోంది. ఇందుకోసం నిధులు సేకరించే పనిలో ఉంది సమంత. ఇందులో భాగంగా సినిమాల్లో తను వేసుకున్న కాస్ట్యూమ్స్ వేలం వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా వచ్చిన డబ్బులను ప్రత్యూష ఫౌండేషన్‌ తరుపున జరిగే సేవా కార్యక్రమాల్లో వినియోగిస్తారట. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ అకౌండ్ ద్వారా వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మహిళలు, పిల్లల సాధికరత కోసం పని చేస్తున్న 'ప్రత్యూష' చారిటీ ఆర్గనైజేషన్ కోసమే ఇదంతా' అని సమంత ట్వీట్ చేసింది. పలువురు పాపులర్ స్టార్లకు సంబంధించిన వస్తువులను ఈ చారిటీ కార్యక్రమం కోసం వేలంలో అందుబాటులోకి తెస్తాం అంటోంది సమంత.

English summary
South India actress Samantha posted headache pic in twitter. "Migraine since the afternoon.... Boo hoo... Unbearable" she tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu