వివి వినాయక్‌తో కలిసి ఇటలీ చెక్కేస్తున్న సమంత!
హైదరాబాద్: వివి వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటలీలో ప్లాన్ చేసారు.
ఈ మేరకు యూనిట్ సభ్యులంతా ఇటలీ వెళ్లబోతున్నారు. ఇక్కడ పలు సాంగుల చిత్రీకరణ జరుపనున్నారు. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. శ్రీ లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 4గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

వివి వినాయక్ దర్శకత్వం కావడం, సమంత హీరోయిన్ గా చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్ పరంగా ఫర్వాలేదనిపిస్తున్నాడు. మరి వెండితెరపై ఏ మేరకు నిలదొక్కుకుంటాడో చూడాలి. ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి వినాయక్ అత్యంత ఎక్కువ మొత్తంలో రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్ల సమాచారం. అదే విధంగా తన కొడుకు సరసన సమంతను హీరోయిన్ గా ఒప్పించడానికి కూడా ఆమెకు హారీ మొత్తంలోనే ఆఫర్ చేసాడట బెల్లంకొండ. కొడుకు సినిమా కాబట్టి వెనకా ముందు ఆలోచించకుండా బెల్లంకొండ తెగ ఖర్చు పెడుతున్నాడని వినికిడి.


Click it and Unblock the Notifications











