మహేష్ తో జాక్ పాట్ కొట్టిన మరో హీరోయిన్...?!
ఆరేళ్ల క్రితం మహేష్ బాబు 'పోకిరి"తో ఇలియానాకు తగిలిన జాక్ పాట్ ఇప్పుడు 'దూకుడు"తో సమంతకు తగిలింది. రామ్ సరసన దేవదాసు చిత్రం ద్వారా పరిచయమైన ఇలియానాకు రెండవ సినిమానే పోకిరి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాక్సాఫీసు హిట్ కావడంతో ఆమె రేంజ్ పెరిగింది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలబడింది.
దీంతో ఏకంగా ఇలియానా అత్యధిక పారితోషికం తీసుకునే నాయికగా రాణిస్తోంది. ఇప్పుడు 'ఏ మాయ చేసావె" ద్వారా పరియమైన సమంతకు ముచ్చటగా మూడవ సినిమా 'దూకుడు". గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. దాంతో సమంతకు కమర్షియల్ నాయికగా పేరు వచ్చేసింది. అటు ఇలియానా, ఇటు సమంత నటించిన పోకిరి, దూకుడు చిత్రాల్లో మహేష్‌బాబు హీరోకావడం విశేషం.
ప్రస్తుతం సమంత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న'ఈగ"లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్, వి.వి.వినాయక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్నదని, అందులో కూడా సమంతే కథానాయిక అని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. ఇదిలావుండగా, తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన గౌతమ్ వాసుదేవమీనన్ దర్శకత్వంలో వస్తున్న 'ఎర్రగులాబీలులో సమంత ఓ ముఖ్యపాత్ర పోషించింది. తమిళంలో రూపొందిన ఓ చిత్రంలో తెలుగులో 'కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు" పేరుతో అనువాదమవుతోంది. ఇందులో కూడా సమంతే కథానాయిక. మొత్తంమీద 'దూకుడు"మహత్యమా అని సమంత కెరీర్ ఇలా పలు చిత్రాలతో యమస్పీడ్ గా ఉందని విశ్లేషకుల ఉవాచ.


Click it and Unblock the Notifications











