తెలుగువాళ్లు చేసిన పాపమేంటీ..?జూ ఎన్టీఆర్ కి నా తడాకా చూపిస్తా..!
'ఏ మాయ చేసావె" సినిమాలో పద్దతిగా కాటన్ చీరలు కట్టుకుని సలక్షణంగా కనిపించిన సమంత ఇకపై కూడా అలా సాంప్రదాయబద్దంగా కనిపిస్తుందని అనుకుంటే పొరబడ్డట్టే అంటోంది. తమిళంలో తాను నటించిన రెండు చిత్రాల్లోనూ సమంత దర్శకుడి ఆజ్ఝల మేరకు అందాల విందు చేసింది. 'మాస్కోవిన్ కావేరి" అనే చిత్రంలో అయితే స్విమ్ సూట్ లోనూ దర్శనమిచ్చింది. తమిళవాళ్లు చేసుకున్న పుణ్యమేంటీ..తెలుగువాళ్లు చేసిన పాపమేంటీ? అంటూ సమంతనే అడిగితే...
త్వరలో విడుదలయ్యే 'బృందావనం" సినిమాలో ఎన్టీఆర్ సరసన గ్లామర్ హీరోయిన్ గా తడాఖా చూపించానని, తొందర్లోనే తెలుగు ప్రేక్షకులు కూడా తానెంత గ్లామరస్ అనే సంగతి తెలుసుకుంటారని అంటోంది. 'అదుర్స్" లో నయనతార కంటే షీలా రెచ్చిపోయి ఎక్స్ పోజింగ్ చేసినట్టు, 'బృందావనం"లో కాజల్ ని పక్కకుపెట్టి సమంత ఆ పని చూసుకుందట. ఇంతగా ఊరిస్తోన్న సమంత మరి 'బృందావనం"లో ఏ రేంజ్ లో సత్తా చాటుకుందో చూడాలంటే మరి కొన్ని వారాలు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











