తడిసిన బట్టల్లో సమంత హాట్ హాట్ గా...
సమంత ప్రస్తుతం మహేష్ సరసన మరోసారి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే చిత్రంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టైటిల్ సాంగ్ ని తమిళనాడులోని మధురై సమీపంలోని కుట్రలం గ్రామంలో పిక్చరైజ్ చేస్తున్నారు. ఆ ప్లేస్ గుడులకు, వాటర్ ఫాల్స్ కు బాగా పేరు పొందింది. మన క్రియేటివ్ డైరక్టర్స్ అందరికీ ఆ ప్లేస్ అంటే చాలా మక్కువ. ఇక తెలుసిన సమాచారం ప్రకారం ఆ పాటలో ఆమె మణిరత్నం రోజా చిత్రంలో చిన్ని చిన్ని ఆశ పాట తరహాలో సోలో సాంగ్ చిత్రీకరిస్తున్నారని చెప్తున్నారు. ఆ పాటలో ఆమె తడిసిన అందాలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయని చెప్తున్నారు. 'ఆరడుగుల అందగాడు వస్తాడు నాతో, వేస్తాడు ఏడు అడుగులు'అంటూ పాట పాడుకుంటుంది.
ఇక వెంకటేష్, మహేష్‌బాబు, సమంత, ప్రకాష్‌రాజ్, జయసుధలపై ఈ పాట చిత్రీకరిస్తున్నారు. ''అన్మదమ్ముల అనుబంధానికి అద్దం పట్టే చిత్రమిది. ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలను తెర మీద ఆవిష్కరిస్తున్నాం. మా ప్రయత్నం అందరికీ నచ్చుతుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మార్చి 2 వరకూ అక్కడే చిత్రీకరణ కొనసాగుతుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రంతో పాటు సమతం..'ఎటో వెళ్లిపోయింది మనసు'అనే చిత్రంలో చేస్తోంది. తమిళ, తెలుగు, హిందీ భాషలలో సమంత హీరోయిన్‌గా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











