హరీష్ శంకర్ కామెంట్స్‌తో చిర్రెత్తిన సమంత
ఇటీవల ఓ కిడ్‌తో షూటింగులో పాల్గొన్న సమంత....అమ్మలా ఫీలయిందట. ఈ విషయమై ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ 'చిన్న బాబుతో షూటింగ్...అతడు నన్ను కౌగిలించుకున్నాడు....అతని చిన్నిచిన్ని చేతులతో నన్ను గట్టిగా పట్టుకున్నాడు....ఆ సమయంలో అమ్మలా ఫీలయ్యాను' అంటూ ట్వీట్ చేసింది.
సమంత ట్వీట్‌కు లేడీ కమెడియన్ విద్యులేఖరామ్ స్పందిస్తూ......నీ పెళ్లి కోసం వెయిటింగ్, డాన్స్ చేయాలని ఉంది అంటూ కామెంట్ చేసారు. హరీష్ శంకర్ మరో అడుగు ముందుకేసి...'సమంత విడాకులకు కూడా డాన్స్ చేయాలని' అంటూ కామెంట్ చేసారు.
దీంతో చిర్రెత్తిన సమంత వెంటనే రియాక్ట్ అవుతూ....మీరు డాన్స్ చేయడం చూడటానికి నేను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవాలా, నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు అంటూ స్ట్రాంగ్‌గా రిప్లయ్ ఇచ్చింది. సమంత రియాక్షన్ చూస్తుంటే హరీష్ శంకర్ వ్యాఖ్యలకు కోపం వచ్చినట్లు స్పష్టం అవుతోంది.


Click it and Unblock the Notifications












