అలా చేయడంతో ఆగ్రహం.. విసిగించకు అంటూ సమంతపై నాగ చైతన్య ఫైర్
సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో.. నాగ చైతన్య అంత దూరంగా ఉంటాడు. సమంత ఒక్క నెలలో చేసే పోస్ట్‌ల సంఖ్య.. నాగ చైతన్య ఏడాది మొత్తం చేసే సంఖ్యతో సమానంగా ఉంటుంది. అంటే నాగ చైతన్య సోషల్ మీడియా ప్రపంచానికి ఎంత దూరంగా ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో సోషల్ మీడియానే ప్రపంచంగా సమంత ఎలా సాగిపోతోందో కూడా తెలుసుకోవచ్చు. అయితే అప్పుడప్పుడు నాగ చైతన్యకు సంబంధించిన ఫోటోలను సమంత షేర్ చేస్తుంటుంది.

సమంత అలా..
రోజుకు కనీసం పది పోస్ట్‌లైనా చేస్తుంటుంది. అందులో దాదాపు అన్నీ కూడా తన ఫోటోలే ఉంటాయి. ఈ మధ్య తన సాకీ డిజైనర్ దుస్తులను ప్రమోట్ చేసుకుంటుంది. అయితే మధ్య మధ్యలో మాత్రం నాగ చైతన్య ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఎక్కువగా తన భర్త ఫోటోలను షేర్ చేయకపోవడానికి కూడా కారణాలున్నాయని సమంత చెబుతూ ఉంటుంది.

పర్మిషన్ ఇవ్వడు..
నాగ చైతన్య తన ఫోటోలను షేర్ చేసేందుకు నాకు పర్మిషన్ ఇవ్వడు అంటూ సమంత చెప్పుకొచ్చింది. కానీ తానే ఎలాగోలా కొన్ని ఫోటోలను బయటకు వదులుతాను అని తెలిపింది. ఇక ఆదివారం వస్తే మాత్రం ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుందని, ఆ ఒక్క రోజే చై కాస్త నియమాలు పక్కన పెట్టేస్తాడని ఆ మధ్య సమంత చెప్పుకొచ్చింది.

ఆదివారం మాత్రమే..
ఆదివారం మాత్రం చై చిల్ అవుతాడని, ఆ ఒక్క రోజు మాత్రమే నాన్ వెజ్ తింటాడని సమంత చెప్పుకొచ్చింది. మిగతా రోజులన్నీ అసలు ఆ వైపే చూడని, సండే లంచ్ మాత్రం దుమ్ములేపుతాడని సమంత తెలిపింది. ఇక తమ ఇద్దరి మధ్యన కామన్ ఎమోషన్ హష్ అని సమంత ఆ మధ్య పేర్కొంది.

బిడ్డ మాదిరి..
హష్‌ను సమంత తన కొడుకుగా చూసుకుంటుంది. హష్ కోసం చై సామ్ ఇద్దరూ కూడా గొడవపడుతుంటారు. హష్‌కు నేనంటే ఇష్టం.. నేనంటే ఇష్టం అంటూ వాగ్వాదానికి దిగుతుంటారు. ఆ మధ్యసామ్ జామ్ షోలోనూ ఈ విషయం గురించి సమంత ప్రస్థావించింది.
Recommended Video
తాజాగా అలా..
నాగ చైతన్య మీద హష్ హాయిగా పడుకుని ఉంటే.. సమంత గెలికింది. అలా హష్‌ను గెలకడంపై చై ఫైర్ అయ్యాడు. విసిగించకు చిరాకు తెప్పించకు అని సమంత మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. సమంత మాత్రం నాగ చైతన్యను వెక్కిరిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











