మళ్లీ ట్విట్టర్ పేజి కి ఎక్కిన హాట్ సమంతా
ఆ మధ్యన ట్విట్టర్ వద్దనుకున్న హాట్ హీరోయిన్ సమంతా మళ్లీ ట్విట్టర్ ని ఉపయోగించటం మొదలెట్టింది. '@Samanthaprabhu2'తో తన అకౌంట్‌ను ప్రారంభించింది. తన అభిమానులను పలకరించటమే ఆమె ఉద్దేశం. ఆమెకు టాలీవుడ్ స్టార్స్ రాణా, రామ్, రాజమౌళి, దేవా కట్టా, త్రిష, మంచు లక్ష్మి తదితరులు అభినందనలు తెలిపారు. ఇక మొదట్లో ఆమె చాలా ఉత్సాహంగా ట్వీట్స్ ఇచ్చేది. కానీ అక్కడ తన ప్రైవసీకి భంగం వాటిల్లటంతో సమంతా ట్విట్టర్ పేజ్‌లో పోస్టింగ్స్‌లను తొలగించింది. కానీ తనపై వచ్చే రూమర్స్ కు సరైన సమాధానం చెప్పాలంటే ట్విట్టరే సరైన మార్గం అని భావించి ఇలా మళ్లీ దర్శనమిచ్చిందని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమె చిత్రాలు వరుసగా రెడీ అవుతున్నా.
నాగచైతన్య 'ఆటోనగర్ సూర్య', ' రామ్ చరణ్ ' ఎవడు' మణిరత్నం ' కాదల్' గౌతమ్ మీనన్ ' ఎటు వెళ్లిపోయిందో మనసు' త్వరలో విడుదల కానున్నాయి. నిర్మాతలకు ఆమె మీద పెట్టుబడి పెడితే లాభాలకు ఇబ్బంది ఉండదనే నమ్మకం ఆమెను తమిళ, తెలుగు భాషల్లో బిజీ చేస్తోంది. ప్రస్తుతం ఆమె మహేష్ సరనస చేస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిద్దార్ద సరసన నందినీ రెడ్డి దర్శకత్వం షూటింగ్ లోనూ రెగ్యులర్ గా పాల్గొంటోంది. అడపా దడపా ఆమె యాడ్ ఫిల్మ్ లు కూడా చేస్తోంది.


Click it and Unblock the Notifications











