సమంత: ఇక్కడ శృంగారం రసం, అక్కడ ఆ రసం...
హైదరాబాద్: సినిమాల్లో హీరోయిన్లు శృంగార రసంతో పాటు నటనకు సంబంధించిన నవ రసాలు ఒలికించడం మామూలే. అయితే ఈ మధ్య కొందరు హీరోయిన్లు యాడ్ ఫిల్మ్స్ చేస్తూ పళ్ల రసాలు కూడా అభిమానులపై ఒలికిస్తున్నారు. వారు చేసే ఈ యాడ్ల మూలంగా అభిమానులను నోరు తెగ ఊరేస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీల పానీయాలు, పళ్లరసాల అమ్మకాలు తెగ అమ్ముడవుతున్నాయి. వీరితో ప్రచారం చేయించడం వెనక అదన్నమాట కిటుకు.
తాజాగా హీరోయిన్ సమంత కోకాకోలా కంపెనీ ఉత్పత్తి అయిన ‘మాజా'కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపకయింది. సౌత్ లో మాజా యాడ్ కు ఎంపికయిన తొలి హీరోయిన్ సమంతే కావడం విశేషం. త్వరలో సమంతతో నోరూరించే యాడ్లు చిత్రీకరించి జనాలపైకి వదలబోతున్నారు. మరి సిద్ధంగా ఉండండి కొనడానికి....!

సినిమాల పరంగా ప్రస్తుతం టాప్ లో ఉన్న సమంత...ఇటు యాడ్ ఫిల్మ్స్ విషయంలోనూ అందరికంటే ముందు ఉంది. వీటి ద్వారా ప్రస్తుతం సౌత్ లో అత్యధికంగా సంపాదిస్తున్న హీరోయిన్ కూడా ఆమె అని అంటున్నారు. సమంత కూడా వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా చేస్తోంది.
ఆమె సినిమాల విషయానికొస్తే....
సమంత సినిమాల విషయానికొస్తే... ఇటీవల ఆమె తమిళంలో కత్తి చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. విజయ్ హీరోగా నటించారు. తమిళంలో సమంతకు ఇదే ఇప్పటి వరకు తొలి మరియు అతి పెద్ద హిట్. ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూలు చేసింది.
ప్రస్తుతం సమంత తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య, ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగు దశలో ఉంది.


Click it and Unblock the Notifications











