కుర్రాళ్లు జాగ్రత్త... సమంత రఫ్పాడించ గలదు!
ఆ మధ్య హీరోయిన్ సమంత ఓ షాపు ఓపెనింగుకు వచ్చిన సందర్భంగా కొందరు ఆకతాయిలు ఆమెపై వేయకూడని చోట చేయి వేసి ఇబ్బంది పెట్టారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపై ఎవరైనా అలాంటి తుంటరి వేశాలు వేస్తే కుదరదు. ఎందుకంటే సమంత ఇప్పుడు కరాటే నేర్చుకుంటోంది. బాడీ ఫిట్ నెస్ లో భాగంగా యోగాతో పాటు, కరాటే కూడా ప్రాక్టీస్ చేస్తోంది. ఇకపై ఎవరైనా ఆమెపై చెయ్యేస్తే ఆ చేతిని అమాంతం విరిచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ప్రస్తుతం సమంత రాజమౌళి దర్శకత్వంలో ఈగ సినిమాతో పాటు, మహేష్ బాబు సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నందినిరెడ్డి దర్శకత్వంలో సిద్ధార్థ సరసన ఓ సినిమా చేస్తోంది. తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా...ఆ మూడు సినిమాలు భారీ విజయం సాధించడంతో సమంత స్టార్ హోదా ఓ రేంజ్ కు చేరుకుంది.
న్యూ ఇయర్ ను పురస్కరించుకుని సమంత వెంకట్రామన్ క్యాలెండర్ కోసం శృంగార భంగిమల్లో ఫోజులు ఇవ్వడంతో యూత్ ఆమంటే పడి చస్తున్నారు. దర్శక నిర్మాతలు కూడా ఆమె అందచందాలను క్యాష్ చేయసుకోవడానికి ఎంత ఖర్చయినా సరే వెనకాడకుండా ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్ గా బుక్ చేసుకోవడానికి పోటీ పడుతున్నారు.


Click it and Unblock the Notifications