చెడిపోతుంది, ఆ సినిమా జోలికి పోనని చెప్పిన సమంత!
హైదరాబాద్: హీరోయిన్ సమంత 'క్వీన్' అనే హిందీ చిత్రం రీమేక్‌లో నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇటీవల నటించిన 'క్వీన్' అనే హిందీ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు అందాయి. ఇందులో కంగనా రనౌత్ పెర్ఫార్మెన్స్ కూడా అదరహో అనే విధంగా ఉందని మెచ్చుకున్నారంతా.
ఈ సినిమా బాగుందని సమంత వ్యాఖ్యానించడంతో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ చిత్రాన్ని సౌత్‌లో రీమేక్ చేస్తే బాగుటుందని, క్వీన్ చిత్రంలో కంగనా రనౌత్ పోషించిన పాత్ర చేయాలనే ఆశతో సమంత ఉందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఈ సినిమా ద్వారా సమంత నిర్మాతగా మారుతుందనే గాసిప్స్ సైతం ప్రచారంలోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో....ఓ అభిమాని ఈ విషయమై సమంతను ట్విట్టర్ ద్వారా వివరణ కోరారు. 'క్వీన్' సినిమా రీమేక్‌లో మీరు నటిస్తారా? అని సదరు అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత స్పందిస్తూ... 'ఆ సినిమాను రీమేక్ చేస్తే ఒరిజినల్ వెర్షన్‌ను చెడగొట్టిన వాళ్లం అవుతాం. అలా చేయడం మంచిది కాదని నా భావన. అందుకే ఆ సినిమా జోలికి వెళ్లే ఉద్దేశ్యం నాకు లేదు' అని సమంత స్పష్టం చేసింది.
ప్రస్తుతం సమంత నటిస్తున్న సినిమాల విషయానికొస్తే....ఆమె తెలుగులో నటించిన ఆటోనగర్ సూర్య, మనం చిత్రాలు పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. దీంతో పాటు మరో రెండు తెలుగు చిత్రాలు, రెండు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది సమంత.


Click it and Unblock the Notifications











