Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మజిలీ’ ఇచ్చిన ఉత్సాహం: మరో సినిమా సై అంటున్న చై-సామ్
నాగ చైతన్య, సమంత కలిసి నటించిన 'మజిలీ' చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన తొలి వారంలనే రూ. 45 కోట్ల గ్రాస్, రూ. 28 కోట్ల షేర్ వసూలు చేసి మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
సమంత, చైతూ కలిసి నటించిన తొలి చిత్రం 'ఏమాయ చేశావే'... ఈ సినిమా వల్లే ఈ ఇద్దరి కెరీర్ మలుపు తిరిగింది. తర్వాత వీరు కలిసి చేసిన 'మనం' కూడా భారీ విజయం అందుకుంది. అయితే 'ఆటో నగర్ సూర్య' మూవీ మాత్రమే ప్లాప్ చిత్రంగా నిలిచింది.
ఈ ఇద్దరూ పెళ్లి తర్వాత తొలిసారి కలిసి నటించిన చిత్రం 'మజిలీ'. ఈ సినిమాపై మందు నంచీ మంచి అంచనాలే ఉన్నప్పటికీ... రిలీజ్ తర్వాత అంచనాలను మించిన విజయం అందుకుంది. వీరు ఇప్పటి వరకు కలిసి చేసిన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే.
'మజిలీ' విజయంతో పలువురు ఫిల్మ్ మేకర్స్ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా చేయడానికి కథలతో సంప్రదిస్తున్నారట. అయితే కథల ఎంపిక విషయంలో తొందర పడకుండా తమకు సూటయ్యే సబ్జెక్ట్, డిఫరెంటుగా, యూనిక్‌గా ఉండే కథ దొరికితేనే చేయాలని డిసైడ్ అయ్యారట. అన్ని సెట్టయితే ఈ ఏడాదే వీరి కాంబోలో మరో సినిమా ప్రారంభం కావొచ్చు.