twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మజిలీ’ ఇచ్చిన ఉత్సాహం: మరో సినిమా సై అంటున్న చై-సామ్

    |

    నాగ చైతన్య, సమంత కలిసి నటించిన 'మజిలీ' చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన తొలి వారంలనే రూ. 45 కోట్ల గ్రాస్, రూ. 28 కోట్ల షేర్ వసూలు చేసి మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

    సమంత, చైతూ కలిసి నటించిన తొలి చిత్రం 'ఏమాయ చేశావే'... ఈ సినిమా వల్లే ఈ ఇద్దరి కెరీర్ మలుపు తిరిగింది. తర్వాత వీరు కలిసి చేసిన 'మనం' కూడా భారీ విజయం అందుకుంది. అయితే 'ఆటో నగర్ సూర్య' మూవీ మాత్రమే ప్లాప్ చిత్రంగా నిలిచింది.

    Samantha is planning to act with her husband Chay again

    ఈ ఇద్దరూ పెళ్లి తర్వాత తొలిసారి కలిసి నటించిన చిత్రం 'మజిలీ'. ఈ సినిమాపై మందు నంచీ మంచి అంచనాలే ఉన్నప్పటికీ... రిలీజ్ తర్వాత అంచనాలను మించిన విజయం అందుకుంది. వీరు ఇప్పటి వరకు కలిసి చేసిన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే.

    'మజిలీ' విజయంతో పలువురు ఫిల్మ్ మేకర్స్ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా చేయడానికి కథలతో సంప్రదిస్తున్నారట. అయితే కథల ఎంపిక విషయంలో తొందర పడకుండా తమకు సూటయ్యే సబ్జెక్ట్, డిఫరెంటుగా, యూనిక్‌గా ఉండే కథ దొరికితేనే చేయాలని డిసైడ్ అయ్యారట. అన్ని సెట్టయితే ఈ ఏడాదే వీరి కాంబోలో మరో సినిమా ప్రారంభం కావొచ్చు.

    English summary
    Samantha is planning to act with her husband Chay again. The star couple Naga Chaitanya and Samantha have delivered hit with recernt release Majili.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X