దానికోసం చాలిచాలని దుస్తులు వేసుకోవాల్సివస్తుంది..
సమంత ప్రస్తుతం హాట్ టాపిక్. ఈ అమ్మడు ఒక్క సినిమా తో చాలా క్రేజిని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు జూ యన్.టి.ఆర్ తో బృందావనం లో నటిస్తుంది. జనరల్ గా సినిమాతారలంటే అంతులేని ఆర్భాటం. మేకప్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండరు. కాని సమంత అందరిలా కాకుండా సాధారణ జీవితాన్నే గడుపుతాను అని అంటుంది. సమంత అనగానే మనకు 'ఏం మాయ చేశావే' సినిమా గుర్తోకోస్తుంది. 'జెస్సీ' గా చక్కని చీర కట్టుతో అంతలా జీవించింది ఆ సినిమాలో. కేరళ అందాలకు కోత్తసోగసులు తెచ్చింది.
నేను నిజజీవతంలో చాలా సాధారణంగా గడపడానికి ఇష్టపడతాను. నేను అందరిలాగే మామూలు అమ్మాయినే కదా, హంగూ, ఆర్భాటం పడవు. సాదాసీదాగా వుంటే చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. ఇక తెర మీదంటే సినిమా కోసం మనకు సరిపడని దుస్తులు, నచ్చని ఆభరణాలు పాత్రల కోసం వేసుకోవాలి. కానీ ఇంట్లో నా ఇష్టం కదా ! మా ఇంట్లో నన్ను ఆపేవారు ఎవరూ వుండరు . నా ఇష్టం వచ్చినట్లు వుండవచ్చు. అని అంటుంది ఈ చెన్నై ముద్దుగుమ్మ.


Click it and Unblock the Notifications











