బెల్లంకొండ,సమంత వివాదంపై ఫిల్మ్ ఛాంబర్
సమంత పై బెల్లంకొండ సురేష్ ..ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాటర్ పై ఫిల్మ్ ఛాంబర్ లో ఈ రోజు(శుక్రవారం)చర్చ జరిగింది. నిర్మాత కె.ఎల్ నారాయణ అధ్యక్ష్యతన జరిగిన ఈ సమావేశంలో ఫైనల్ గా సమంతను ఆ చిత్రానికి డేట్స్ ఎడ్జెస్ట్ చేయవలిసిందేనని ఆర్డర్ చేసారు. మొదట సమంత ఒప్పుకోకపోయినా చివరకు ఆమె ఒప్పుకోవాల్సి వచ్చింది. వచ్చే జనవరి నుంచి ఆ చిత్రం షూటింగ్ లో ఆమె పాల్గొననుంది. సమంత వెనక్కి అడ్వాన్స్ ఇవ్వటానకి రెడీ అయ్యినా ఆమెను వదులుకోవటానికి నిర్మాత బెల్లంకొండ రెడీగా లేరు. ఎందుకంటే దూకుడు చిత్రం తర్వాత సమంత స్టేచర్ మారిపోయింది. ఆమె తెలుగులో నెంబర్ వన్ స్టేజికి వచ్చింది. సిద్దార్ద హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఆ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.
ఇక అస్సలు గొడవ మొదలైన విధానం ఏమిటంటే..సమంతపై బెల్లంకొండ సురేష్ రీసెంట్ గా మూవీ ఆర్టిస్టుల అశోశియేషన్ మరియు నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసారు. ఆమె అన్ ప్రొఫెషనల్ బిహేవియర్ ఈ కంప్లైంట్ లో ప్రధానాంశం. ఆమెను తమ సినిమాలో సిద్దార్ధ సరసన బుక్ చేసుకోగా ఆమె అదే డేట్స్ ని మహేష్ చిత్రం కేటాయించి తమను ఫైనాన్సియల్ క్రైసిస్ లో పడేసిందని ఆయన ఆరోపించారు. అయితే సమంత అడ్వాన్స్ తీసుకుని డేట్స్ కేటాయించి ఈ లోగా మహేష్ తో దిల్ రాజు నిర్మిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కోసం అవే డేట్స్ ని ఇచ్చేయటం జరిగింది. దీనిపై బెల్లంకొండ సురేష్ మండిపడుతున్నారు. ఈ విషయమై నిర్మాతల మండలి ఓ నోటీస్ ను ఇచ్చింది. దానికి సమాధానం వచ్చిన తర్వాత ఈ విషయమై నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. అయితే సమంతకు చెందిన వారు మాత్రం ఆ నిర్మాత సరైన ప్లానింగ్ లేకపోవటంతో ఈ పని చేయవలిసి వచ్చింది..మా దగ్గర వేలీడ్ రీజన్ ఉంది అని చెప్పారు. కానీ చివరకు ఇలా సెటిల్ చేసుకోక తప్పలేదు.


Click it and Unblock the Notifications











