Just In
Don't Miss!
- Finance
సెబి షాకింగ్: HDFCకి భారీ జరిమానా, షేర్లు పతనం
- Automobiles
ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- News
కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ బాబుతో సమంత ఐటం సాంగ్.. (ఫోటోలు)
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో హాట్ హీరోయిన్ సమంత ఐటం సాంగు చేయబోతోందనే వార్తలు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం '1' సినిమా షూటింగులో ఉన్న మహేష్ బాబు నెక్ట్స్ శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' సినిమాకు చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈచిత్రంలో ఇప్పటికే తమన్నాను హీరోయిన్‌గా ఎంపిక చేసారు. మరో హీరోయిన్ కూడా ఖరారు కావాల్సి ఉంది. అయితే సమంతతో ఐటం సాంగు చేయించడం ద్వారా సినిమాకు మంచి క్రేజ్ వస్తుందనే ప్లాన్ చేసారు. ఈ విషయమై ఇప్పటికే సమంతతో కూడా చర్చించారట.
అయితే సమంత నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని, ఐటం సాంగు చేయాలా? వద్దా? అనే దానిపై ఆమె త్వరలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

హీరోయిన్లు-ఐటం సాంగులు
ఇటీవల బాలీవుడ్ సినిమాల్లో స్టార్ హీరోయిన్లు ఐటం సాంగు చేయడం సర్వసాధారణం అయింది. ఈ ట్రెండును టాలీవుడ్లో ప్రారంభమైనా....కింది స్థాయి హీరోయిన్లు మాత్రమే చేస్తున్నారు. వీరు చేసే ఐటం సాంగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

సమంతతో చేయిస్తే సంచలనమే
ప్రస్తుతం సమంత తెలుగు సినీ పరిశ్రమలో నెం.1 స్థానంలో కొనసాగుతోంది. సమంత ఉంటే చాలు సినిమాకు ఎక్కడలేని క్రేజ్. ఈ నేపథ్యంలో ఆమెతో ఐటం సాంగు చేయడం ద్వారా మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

అంగీకరిస్తుందా?
మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలో ఐటం సాంగు చేయడంలో అభ్యంతరం లేదు కానీ.....దీని వల్ల భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయనే ఆలోచనతో ఆమె నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది.

శ్రీను వైట్ల
దూకుడు సినిమాను మహేష్ బాబు ఇమేజ్‌కు తగిన విధంగా పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా రూపొందించిన శ్రీను వైట్ల....‘ఆగడు' స్క్రిప్టు తన గత సినిమాలకు వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

నిర్మాణ సంస్థ
14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో ‘దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో ‘ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం.

తమన్ సంగీతం
మహేష్ బాబు నటించిన దూకుడు, బిజినెస్ మేన్ చిత్రాలకు సంగీతం అందించిన యువ మ్యూజీషియన్ తమన్ మరోసారి ఆయనతో చేసే అవకాశం దక్కించుకుని హాట్రిక్ సాధించబోతున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు త్వరలో చేయబోయే ‘ఆగడు' చిత్రానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు.