‘సీ.వా.సి.చె’ టీంలో సమంత జాయిన్

By Bojja Kumar

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో హీరోయిన్ సమంత మహేష్ బాబు సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే సమంత ఈ సినిమా టీంలో జాయిన్ అయింది. ప్రస్తుతం షూటింగ్ తమిళనాడులోని కత్రాలంలో జరుగుతోంది. వెంకటేష్, మహేష్ బాబు, సమంత, అంజలిలపై ఇక్కడ పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అదే విధంగా పమంతపై సోలో సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. మిక్కీజె మేయర్ సంగీతం అందిస్తుండగా కెవి. గుహన్ సినిమాటోగ్రపీ నిర్వహిస్తున్నారు.

సమంత ప్రస్తుతం ఈ చిత్రంతో పాటు రాజమౌళి దర్శకత్వంలో 'ఈగ', నాగచైనత్యతో 'ఆటోనగర్ సూర్య', రామ్ చరణ్ సరసన 'ఎవడు', నాని హీరోగా రూపొందుతున్న 'ఎటో వెళ్లి పోయింది మనసు', నందిరెడ్డి దర్శకత్వంలో సిద్ధార్థ సరసన మరో సినిమాలో నటిస్తోంది.

ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోన్నారు. ఇందులో లెక్చరర్ గా మహేష్ బాబు పాత్ర ఉంటుంది. ఈసినిమా వెంకీ హీరోగా వచ్చిన 'సుందరకాండ' సినిమాను పోలిఉంటుందనే ఊహాగాలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X