‘ఎటో వెళ్లిపోయింది...’లో సమంత జాయిన్
కొంత కాలంగా అనారోగ్యంతో షూటింగుకు దూరంగా ఉన్న సమంత తాజాగా ఈ చిత్రం షూటింగులో జాయిన్ అయింది. చెన్నయ్ లోని కల్పకం వద్ద ఈచిత్రానికి సంబంధించిన లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలియదు.
వివిధ వయసుల్లో కలుసుకొన్న ఓ జంట మధ్య ప్రేమ పుట్టిన సందర్భం ఎలాంటిదనే విషయాన్ని ఈ చిత్రంలో అందంగా ఆవిష్కరిస్తున్నారు. అదుపు తప్పిన మనసుల కోసం వారు అన్వేషించిన తీరు తియ్యటి అనుభూతుల్ని పంచుతుంది. వినోదం, భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న కథాంశంతో ఈచిత్రం రూపొందుతోంది.
సమంత ఈ చిత్రంలో టీనేజ్ అమ్మాయిగా, పెళ్లైన యువతిగా డిఫెరెంట్ గా ఒకే పాత్రలో కనిపించనుంది. ఇళయరాజా స్వరాలు అందించడం ఈ చిత్రానికి ఉన్న మరో ప్లస్ పాయింట్. కృష్ణుడు, విద్య, అనుపమ, రవి రాఘవేంద్ర, శ్రీరంజని, శ్వేత, ప్రీతి తదితరులు ఇతర పాత్రధారులు. మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: ఎం.ఎస్.ప్రభు, ఓం ప్రకాష్, సంగీతం: ఇళయరాజా.


Click it and Unblock the Notifications












