విజయ నిర్మల మృతిపై సమంత, కాజల్, రాశి ఖన్నా, ఈషా రెబ్బా సంతాపం
ప్రముఖ నటి, డైరెక్టర్, సూపర్‌స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల మరణం యావత్ సినీ లోకాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. బుధవారం తెల్లవారుజామున ఆమె మరణవార్త విని టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయింది. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆమె గుండెపోటుతో మరణించారు. విజయ నిర్మల మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె కుటుంబానికి తమ తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సమంత, రాశి ఖన్నా, కాజల్, ఈషా రెబ్బా తదితరులు తమ తమ సంతాపాలు తెలిపారు.
''తెలుగు చిత్ర సీమలో మహిళా టెక్నీషియన్లకు ఓ దారి చూపిన లెజెండ్ విజయ నిర్మల. ఆమె మృతిచెందడం తీవ్రంగా కలచి వేసింది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఘనత ఆమె సొంతం'' అని సమంత ట్వీట్ పెట్టింది.
''విజయ నిర్మల మరణ వార్త విని షాకయ్యా. తెలుగు చిత్ర పరిశ్రమలో స్ఫూర్తిదాయకమైన ప్రయాణం సాగించి.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన గొప్ప మనిషి విజయనిర్మల. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'' అని రాశి ఖన్నా ట్వీట్ చేసింది.

''తెలుగు చిత్ర పరిశ్రమ ఓ ఐరన్ లేడీ లాంటి మనిషిని కోల్పోయింది. గొప్ప నటి, దర్శకురాలు, గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మహిళగా విజయ నిర్మల ఖ్యాతి చెప్పుకోదగినది. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు మరువలేనివి'' అని ఈషా రెబ్బా తన సంతాపాన్ని తెలిపింది.
''విజయ నిర్మల మృతి చెందారని తెలిసి షాకయ్యాను. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను'' అని కాజల్ ట్వీట్ చేసింది.
విజయ నిర్మల భౌతికకాయాన్ని ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆమె స్వగృహానికి తీసుకు రానున్నారు. అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శనార్థం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలింఛాంబర్‌కు తరలించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం విజయ నిర్మల అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం.


Click it and Unblock the Notifications











