షాకింగ్: సమంత అతన్ని అమాంతం ఎత్తుకుంది (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: సమంతకు చెందిన ఫోటో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆమె తన టీంలోని చిత్తూరు రవిని అమాంతం ఎత్తుకుంది. మిర్చి సినిమాలో అనుష్క ప్రభాస్‌ను ఎత్తుకున్నట్లు...అతన్ని అమాంతం ఎత్తుకుంది. తాను కేవలం అందగత్తెను మాత్రమే కాదు, బలవంతురాలిని కూడా అని నిరూపించుకుంది. తన టీం సభ్యులతో సమంత ఎంత కలివిడిగా ఉంటుందో ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది.

సమంత సినిమాల విషయానికొస్తే...ఆమె ఇటీవల నటించిన 'అల్లుడు శీను' చిత్రం బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనే విధంగా ఉంది. ఈ చిత్రంలో ఏ సినిమాలో చేయనంతగా ఎక్స్ ఫోజింగ్ చేసింది సమంత. కొత్త హీరోతో ఈ రేంజిలో రెచ్చిపోయిన సమంత రెమ్యూనరేషన్ భారీగా తీసుకున్నట్లు టాక్.

Samantha lifting Chittoor Ravi

ఇక సమంత తెలుగులో ఎన్టీఆర్ సరసన నటించిన 'రభస', తమిళంలో సూర్య సరసన నటించని 'అంజాన్' (తెలుగులో సికిందర్) చిత్రాల ఆగస్టు నెలలో ఒకేసారి విడుదల కాబోతున్నాయి. సమంత నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలవుతుండటంతో సమంత ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

దీంతో పాటు ఆమె తమిళంలో విజయ్ సరసన 'కత్తి' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు విక్రమ్ హీరోగా తెరకెక్కబోయే మరో చిత్రంలోనూ ఎంపికయింది. తెలుగులో త్వరలో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే సినిమాలో నటించబోతోంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది సమంత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X