షాక్ చేస్తున్న సమంత మాస్టర్ ప్లాన్
నాకు టూరిజం అంటే మొదటి నుంచీ ఇష్టం.ప్రపంచం చుట్టేయాలనిపిస్తుంది.అందుకే ఏయే దేశాల్లో ఏయే ప్రదేశాలు చూడాలో ఓ జాబితా సిద్ధం చేసుకొంటున్నాను. ఎందుకంటే సినిమాల్లోకి వచ్చిన తరవాత ఎక్కువగా విదేశాలకు వెళ్తున్నా కదా. అలా వెళ్లినప్పుడు పనిలో పనిగా అక్కడ ప్రసిద్ది చెందిన ప్రాంతాల్ని చూసేయొచ్చు. మొన్న'దూకుడు' కోసం టర్కీ వెళ్లాను. ఆ ప్రదేశం నాకు చాలా బాగా నచ్చింది అంటూ మనస్సులో మాట బయిట పెట్టింది సమంత. ఈ మాటలు విన్నవాళ్ళు సమంత.. నువ్వు మామూలు దానివి కాదు అంటూ ఆమె మాస్టర్ ప్లాన్ కి షాక్ అవుతున్నారు.
అలాగే సమంత తన తదుపరి ప్రాజెక్టుల గురించి చెబుతూ...రాజమౌళి ఈగ,గౌతమ్ మీనన్ తో చేస్తున్న సినిమాలు రెండూ తమిళ, తెలుగులో ఒకేసారి విడుదల అవుతాయి. రెండింటిలోనూ నానినే హీరో. అలాగే సిద్దార్ధ,నాగచైతన్య,మహేష్ బాబు సరసన ప్రాజెక్టులు కన్ఫర్మ్ అయ్యాయని వినపడుతోంది అంటే... ఫస్ట్ డే షూట్ అయితే కానీ నేను ఏ సినిమానూ నా చేతిలో ఉందని చెప్పలేను అంది. నాకు అటువంటి కొన్ని నమ్మకాలు ఉన్నాయని తెలివిగా సమాధానం చెప్పింది.
ఇక ప్రస్తుతం సమంత డైరీ ఫుల్ గా ఉంది. ఆమె గౌతమ్ మీనన్ మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈగ లోనూ చేస్తోంది. అంతేగాక నాగచైతన్య సరసన ఆటోనగర్ సూర్యలోనూ, మహేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోనూ ఆమెనే తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











