»   » దారుణం: అమలా పాల్ విడాకుల గొడవలో సమంతను ఇరికించి..

దారుణం: అమలా పాల్ విడాకుల గొడవలో సమంతను ఇరికించి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అమలా పాల్‌ తన భర్త, దర్శకుడు ఎఎల్.విజయ్ తో విడాకులు తీసుకోవడానికి సిద్దమవుతుందంటూ కొన్ని రోజులుగా తమిళ మీడియాలో, జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇపుడు వీరి విడాకుల గొడవలో సమంతను లాగుతూ కొన్ని కథనాలు రావడంపై అభిమానులు మండి పడుతున్నారు.

సమంతకు తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసే సేవా కార్యక్రమాలు, కొన్ని మంచి పనుల్లో వీరంతా తరచూ పాలుపంచుకుంటున్నారు. అయితే ఎలాంటి సంబంధం లేక పోయినా అమలా పాల్ విడాకుల వ్యవహారంలో సమంత పేరు వినిపించడంపై ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ చిత్రం 'వడ చెన్నై' నుంచి సమంత తప్పుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్యతో పెళ్లి కోసమే సమంత ఇలా చేసిందని టాక్. సమంత స్థానంలో అమలాపాల్‌ను తీసుకున్నాడు ధనుష్‌. అయితే సినిమాలకు దూరంగా ఉండాలనే తన అభిప్రాయాన్ని లెక్కచేయకుండా అమలా పాల్ ఈ సినిమాకు సైన్ చేయడం భర్త ఎఎల్.విజయ్ కి నచ్చలేదట.

ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య విబేధాలు పెరిగాయని, అమలా పాల్ ఫ్యామిలీ కూడా ఆమెనే సపోర్టు చేయడంతో వ్యవహారం విడాకులు తీసుకోవాలనే ఆలోచన వరకు వెళ్లిందని టాక్... (స్లైడ్ షోలో మరిన్ని వివరాలు)

దారుణం

దారుణం


వారి విడాకుల నిర్ణయానికి, సమంతకు సంబందం లేక పోయినా అలా వార్తలు రాయడంపై ఫ్యాన్స్ మండి పడుతున్నారు.

చెడ్డ పేరు

చెడ్డ పేరు


సినిమాల్లో నటిస్తూ.. తన సంపాదనతో ఎన్నో మంచి పనులు చేస్తూ ఎలాంటి రీమార్కు లేకుండా ఉన్న సమంతకు చెడ్డపేరు తెస్తున్నారని మండి పడుతున్నారు.

సమంత

సమంత


ప్రస్తుతం సమంత ‘జనతా గ్యారేజ్' మూవీలో చేస్తోంది. ఇతర సినిమాలేవీ ఆమె కమిట్ కాలేదు.

నాగ చైతన్యతో వివాహం

నాగ చైతన్యతో వివాహం


టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్యతో సమంత వివాహం జరుగబోతోంది. అందుకే కొత్త సినిమాలు కమిట్ కావడం లేదని అంటున్నారు.

    English summary
    Amala Paul has recently been approached to do a lead role in Dhanush's movie 'Vada Chennai'. As Amala Paul is offering green signal to Off beat movies it was expected she will sign the dotted line. But AL Vijay was unhappy with it. As samantha walked out, the opportunity has right away knocked doors of Amala Paul.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu