'మనం' లో సమంత లుక్ ఇదే...(ఫోటో)

By Srikanya

హైదరాబాద్ : అక్కినేని హీరోలు ముగ్గురూ కలసి నటిస్తున్న చిత్రం 'మనం'. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రియ, సమంత హీరోయిన్స్. విక్రమ్‌ కుమార్‌ దర్శకుడు.అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై సినిమా తెరకెక్కుతోంది. హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో సమంత లుక్ అదిరిపోతుందని,దర్శకుడు ప్రత్యేకంగాతీర్చిదిద్దుతున్నాడని చెప్తున్నారు. మీరు చూస్తున్నది సినిమాలో సమంత లుక్.

నాగార్జున మాట్లాడుతూ ''వినోదాత్మకమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు భావోద్వేగాలతో కూడిన కథని సిద్ధం చేశారు. సన్నివేశాలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అకాడమీలో శిక్షణ పొందిన ముగ్గురు యువకులకు సినిమాలో నటించే అవకాశమిస్తున్నట్లు'' తెలిపారు.

Samantha look in Akkineni's Manam

అలాగే 'వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో కుటుంబం మొత్తం కలసి నటించడం ఇప్పటివరకు రాజ్‌కపూర్‌ కుటుంబానికే దక్కింది. 'మనం' చిత్రం ద్వారా మాకు ఆ అవకాశం వచ్చింది. ఇందులో అఖిల్‌ కూడా నటిస్తే బాగుణ్ను అని అందరూ అంటున్నారు. అఖిల్‌ని మొదట హీరోగా చూసి.. తర్వాత మల్టీస్టారర్‌, కుటుంబ చిత్రాలు చేయాలన్నదే నా ఆలోచన.. ఈ చిత్రంలో అఖిల్ చేస్తాడన్న రూమర్స్ ని ఇలా ఖండించారు నాగార్జున.

తాత, తనయుడు, మనవడు... ఒకేసారి తెరపై సాక్షాత్కరించడం అటు అక్కినేని అభిమానులకే కాక, సగటు ప్రేక్షకులకు కూడా కనుల పండుగ కానుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హర్షవర్దన్ కథ, సంభాషణలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయని తెలుస్తోంది. నాగార్జునకు జోడీగా శ్రీయ నటిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య సర సన సమంత నటిస్తున్నారు. అనూప్‌రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

గతంలో నాగేశ్వరావు, నాగార్జున కలిసి కలెక్టర్ గారి అబ్బాయి చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఈ సినిమాలో మూడు తరాల నటులు కలిసి నిజజీవిత పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణా స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.ఈ సినిమాకి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: పీఎస్‌ వినోద్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X