ఫోటో : సమంత కొత్త అవతారం, ఏమీ తెలియదని ట్వీట్
హైదరాబాద్ : హాట్ హీరోయిన్ సమంత తాజాగా తన ట్విట్టర్లో ఓ ఫోటో పోస్టు చేసింది. భరత నాట్యం వేషధారణలో, నృత్య భంగిమలో ఆమె దర్శనం ఇచ్చింది. అయితే తనకు భరత నాట్యం గురించి ఏమీ తెలియదని, సరదా కోసమే ఇలా డ్రెస్‌అప్ చేసుకుని ఫోటో దిగానని ఆ ఫోటోకు కామెంట్ చేసింది సమంత.
తాజాగా సమంత అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం' చిత్రంలో నటించబోతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని తన ట్విట్టర్లో వ్యాఖ్యానిస్తూ.....ప్రతి కొత్త సినిమా ప్రారంభం ముందు కాస్త నెర్వస్ అవుతాను. ఇప్పుడు కూడా అలాగే అయింది అంటూ వ్యాఖ్యానించింది.
చివరగా 'జబర్దస్త్' సినిమాలో ప్రేక్షకులకు దర్శనం ఇచ్చిన సమంత....త్వరలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతోంది. ప్రస్తుతం ఆమె అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, రభస, మనం, వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందబోయే మూవీతో పాటు మరో రెండు తమిళ చిత్రాల్లో చేస్తోంది.


Click it and Unblock the Notifications












