చంద్రబాబును కలిసిన హీరోయిన్ సమంత
హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు. ఆ మధ్య సమంత హుధూద్ బాధితుల కోసం రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబును కలిసిన సమంత రూ. 10 లక్షల చెక్కును అందజేసారు. సమంతతో పాటు ఇప్పటికే పలువురు స్టార్ చంద్రబాబును కలిసి హుధూద్ బాధితుల సహాయార్థం చంద్రబాబును కలిసి విరాళాలు అందించారు.
విశాఖ హుధూద్ బాధితుల సహాయార్థం నిధుల సేకరణలో భాగంగా టాలీవుడ్ పరిశ్రమ ఈ నెల 30న ‘మేము సైతం' కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంచు ఫ్యామిలీ స్టార్స్ అంతా కబడ్డీ మ్యాచ్ ఆడబోతున్నారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌తో పాటు మంచు లక్ష్మి కూడా వివిధ జట్లుగా విడిపోయి ఆడబోతున్నారు. వీరి టీంలలో ఇతర హీరోలు, హీరోయిన్లు, నటులు ఉంటారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలయ్య, జూ ఎన్టీఆర్ లాంటి వారు తమ తమ కార్యక్రమాలతో ప్రత్యేకత చాటబోతున్నారు.

మేము సైతం...ప్రొగ్రామ్ చూసేందుకు ఒక్కో టికెట్ ఖరీదు రూ. 15000. బుక్ మై షో ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. ఈ టికెట్స్ కొన్నవారంతా థంబోలా గేమ్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంటారు. థంబోలా గేమ్ విజేతకు మెర్జిడెజ్ బెంజ్ కారు గిఫ్టుగా ఇచ్చేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











