అమ్మలా ఫీలయ్యాను : సమంత
ఇటీవల ఓ కిడ్‌తో షూటింగులో పాల్గొన్న సమంత....అమ్మలా ఫీలయిందట. ఈ విషయమై ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ 'చిన్న బాబుతో షూటింగ్...అతడు నన్ను కౌగిలించుకున్నాడు....అతని చిన్నిచిన్ని చేతులతో నన్ను గట్టిగా పట్టుకున్నాడు....ఆ సమయంలో అమ్మలా ఫీలయ్యాను' అంటూ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం సమంత అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం' చిత్రంలో నటింస్తోంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని తన ట్విట్టర్లో వ్యాఖ్యానిస్తూ.....ప్రతి కొత్త సినిమా ప్రారంభం ముందు కాస్త నెర్వస్ అవుతాను. ఇప్పుడు కూడా అలాగే అయింది అంటూ వ్యాఖ్యానించింది.
చివరగా 'జబర్దస్త్' సినిమాలో ప్రేక్షకులకు దర్శనం ఇచ్చిన సమంత....త్వరలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతోంది. ప్రస్తుతం ఆమె అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, రభస, మనం, వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందబోయే మూవీతో పాటు మరో రెండు తమిళ చిత్రాల్లో చేస్తోంది. ఈ రోజు విడుదలైన సంథింగ్ సంథింగ్ చిత్రంలో సమంత అతిథి పాత్ర చేస్తుంది.


Click it and Unblock the Notifications












