సమంత ‘మోనాలిసా’ లుక్...అదిరింది
హైదరాబాద్ : ప్రపంచంలో అత్యంత ఖరీదైన, అందమైన పేయింటిగుల్లో మోనాలిసా పేయింటింగ్ కూడా ఒకటి. ఆ పేయింటింగులో ఏదో రహస్యం ఉందనేది పరిశోధకుల వాదన. ఆమె చిందించే చిరునవ్వు వెనకాల ఓ రహస్యం ఉందట! అదేమిటంటే ఓ సారి చూసినప్పుడు అమె చిరునవ్వు నవ్వుతున్నట్లు, ఇంకోసారి మామూలుగాను కనిపిస్తుందిట! దీని మీద ప్రపంచంలో ఇప్పటి వరకు చాలా రీసెర్చ్ లు జరిగాయి.
ఆ పేయింటింగ్ సంగతి పక్కన పెడితే హీరోయిన్ సమంత మోనాలిసా లుక్ లో దర్శనం ఇచ్చింది. ఇటీవల విజయ్ టీవీ అవార్డులకు సమంత నామినేట్ కాగా...ఇలా మోనాలిసా రూపంలో సమంతను చిత్రీకరించారు. ఈ ఫోటోను సమంత స్వయంగా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్టు చేసింది. ఈ లుక్ లో సమంత ఎలా ఉందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో తెలియజేయండి
వరుస హిట్లతో దూసుకెలుతున్న సమంత ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. నాగ చైతన్యతో కలిసి 'ఆటోనగర్ సూర్య' చిత్రంలో, పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'అత్తారింటికి దారేది', జూ ఎన్టీఆర్ సరసన 'రామయ్యా వస్తావయ్యా', 'రభస', బెల్లకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందబోయే మరో సినిమాలో హీరోయిన్ గా ఎంపికయింది. 2010లో ఏమాయ చేసేవే చిత్రం ద్వారా సీనీరంగ ప్రవేశం చేసిన సమంత ఇప్పటి వరకు దాదాపు 20 సినిమాలకు సైన్ చేసి సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారగా గుర్తింపు తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications












