సమంత కొత్త మోజు: అదిలా చెంతకు చేరడంతో ఫుల్ ఖుష్..
'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అని వూరికే అనలేదు.. సందర్భం వస్తే తప్ప ఇప్పటివాళ్లకు.. ఆ పాత మధురాలేంటో తెలియదు. అలనాటి తార సావిత్రి బయోపిక్ అయిన 'మహానటి' సినిమాతో సమంత కూడా ఇప్పుడు.. ఆ పాత మధురాలను ఎంజాయ్ చేస్తున్నారు.
ఒకప్పటి 'లూనా'తో అప్పటి కాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఇదే నా కొత్త బండి అంటూ.. 'లూనా' ఫోటోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మహానటి సినిమా నేపథ్యంలో.. అప్పటి పరిస్థితులను కళ్లను కట్టినట్లు చూపించడం కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే.. సమంత కూడా 'లూనా'తో గల్లీ గల్లీ తిరగడానికి సిద్దమైపోయారు.

'లూనా'తో హ్యాపీ ఫీలింగ్:
లూనా ఫోటోతో పాటు సినిమాప్రాధాన్యం గురించి చెబుతూ సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా చెప్పుకొచ్చారు. '1980కి వెళ్తున్నాం. కొందరి జీవిత చరిత్రలు అందరూ తెలుసుకోవడానికి అర్హమైనవి. అలాంటి సావిత్రిగారు జీవించిన టైమ్‌ని ఇప్పుడు రీ-క్రియేట్ చేసిన ప్లేస్‌లో నటించడం ఆనందంగా ఉంది. ఆ కాలం నాటి పీస్ (లూనా) నా చెంతకు చేరడం హ్యాపీగా ఉంది. 1960 అండ్ 1970లలో జరిగే సినిమా 'మహానటి' ' అని అన్నారు.

జమున పాత్రలో 'సమంత'?
అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా 'ఎవడే సుబ్రమణ్యం' ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మహానటి'. ఇందులో సావిత్రి పాత్రను కీర్తీ సురేశ్ చేస్తున్నారు. మోహన్‌బాబు, దుల్కర్ సల్మాన్, సమంత కీలక పాత్రలు చేస్తున్నారు.
సమంత జమున పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా ఎలాంటి ప్రకటన లేదు.

నిర్మాతగా మారనున్నారా?:
ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే.. మరోవైపు సొంత ప్రొడక్షన్ హౌజ్ కోసం సమంత ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కన్నడలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 'యూటర్న్' అనే సినిమాను సమంత తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నారట.

రీమేక్ కోసం సంప్రదింపులు:
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన హక్కులను సొంతం చేసుకునేందుకు బెంగళూరు వెళ్లి సంపద్రింపులు కూడా జరిపారట. నిర్మాతగా మారడానికి సమంత చేస్తున్న ప్రయత్నాలకు భర్త నాగ చైతన్య, మామ నాగార్జున కూడా పూర్తి సహకారం అందిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల బోగట్టా.


Click it and Unblock the Notifications











