కొన్ని గంటల్లో సమంత నా కోడలు: ఫోటో షేర్ చేసిన నాగార్జున
సమంత మరికొన్ని గంటల్లో నాగార్జున కోడలు కాబోతోంది. ఈ నేపథ్యంలో సమంతతో దిగిన ఫోటోను నాగ్ షేర్ చేశారు.
సమంత తన ఇంటి కోడలు కాబోతున్న నేపథ్యంలో అక్కినేని నాగార్జున ఓ ఫోటో పోస్టు చేశారు. మరికొన్ని గంటల్లో సామ్ మా ఇంటి కోడలు కాబోతోంది అంటూ తన హ్యాపీ మూమెంట్స్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నారు.
నాగ చైతన్య, సమంత వివాహం నేడు(అక్టోబర్ 6) గోవాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. రాత్రి 11.52 గంటలకు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. ఈ వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం జరుగనుంది.
నాగార్జున, సమంత
ఈ వివాహ వేడుకకు కొద్ది సంఖ్యలో మాత్రమే గెస్టులు హాజరు కాబోతున్నారు. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సమంత ఫ్యామిలీ హాజరు కానుంది.
Recommended Video

అక్కినేని ఫ్యామిలీ
హిందూ సాంప్రదాయంలో జరిగే వివాహ వేడుకలో నాగ చైతన్య గ్రాండ్ మదర్ డి రాజేశ్వరి చీరను సమంత ధరించనుంది. దీంతో పాటు ఆమెకు సంబంధించిన బంగారు నగలను సమంత ధరించనుంది. నాగ చైతన్య ట్రెడిషనల్ ధోతీ ధరిస్తారు.
చైతు మేనమామ వెంకటేష్
నాగ చైతన్యను పెళ్లి కొడుకును చేసిన సందర్భంలో మేనమామ వెంకటేష్ హాజరైన దృశ్యం.

క్రిస్టియన్ వెడ్డింగ్
సమంత, నాగ చైతన్య క్రిస్టియన్ వెడ్డింగ్ శనివారం సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల మధ్యలో జరుగనుంది.


Click it and Unblock the Notifications











