Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అక్కినేని ఫ్యామిలీ వెకేషన్: ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సంబరాల్లో చైతూ-సామ్ (ఫోటోస్)
నాగ చైతన్య, సమంత వివాహం జరిగి ఈ అక్టోబర్ 6తో సరిగ్గా సంవత్సరం పూర్తవుతుంది. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సీని రోటీన్‌గా కాకుండా డిఫరెంటుగా ప్లాన్ చేసుకున్నారు టాలీవుడ్ కపుల్. అక్కినేని ఫ్యామిలీతో పాటు వారికి సన్నిహితులతో విదేశాల్లో వెకేషన్ ప్లాన్ చేశారు. కొన్ని రోజుల క్రితమే సమంత, నాగ చైతన్య కలిసి స్పెయిన్ దేశంలోని ఇబిజా ఐలాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. దేవదాస్ ప్రమోషన్స్ పూర్తి చేసుకుని నాగార్జున కూడా తన భార్య అమల, మరికొందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి స్పెయిన్ ఫ్లైట్ ఎక్కేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సమంత, నాగార్జున అభిమానులతో పంచుకున్నారు.
అక్కినేని ఫ్యామిలీ మొత్తం
చైతన్య, సమంత ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. విదేశాల్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి అక్కినేని ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. అందరితో కలిసి దిగిన ఓ ఫోటో పోస్టు చేసిన నాగార్జున... ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి హాలిడే వెకేషన్ మరింత ఫన్ గా ఉంటుంది అంటూ పేర్కొన్నారు.
జెట్ ప్లైట్ ఎక్కిన అనంతరం నాగ్ ఇలా...
దేవదాస్ ప్రమోషన్స్ ముగిసిన అనంతరం స్పెయిన్ వెళ్లడానికి ఫ్లైట్ ఎక్కిన నాగార్జున అభిమానుల్లో అభివాదం చేస్తూ ఓ ఫోటో పోస్టు చేశారు. పెద్ద జెట్ విమానం ఎక్కి వెకేషన్ వెళుతున్నాను అంటూ పేర్కొన్నారు.
చైతూ-సమంత
స్పెయిన్ దేశంలోని ఇబిజా ఐలాండ్‌లో నాగ చైతన్య, సమంత రొమాంటిక్ మూడ్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యం. ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడుపుతూ తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు.
నైట్ క్లబ్లో
ఇబిజాలోని నైట్ క్లబ్లో ఎంజాయ్మెంట్ మూడ్‌లోకి వెళ్లిపోయిన నాగ చైతన్య, సమంత. సమంత తాను కోరుకున్న విధంగా లైఫ్ లీడ్ చేస్తుందని సోషల్ మీడియాలో ఆవిడ పెడుతున్న స్టేటస్ బట్టి అర్థం చేసుకోవచ్చు.
రీచార్జ్ అవ్వాలంటే...
నాన్ స్టాప్‌గా ఎంజాయ్ చేయాలంటే... కాస్త రీచార్జ్ కావాల్సిందే మరి. మంచి పార్టీ మూడ్‌లో ఉన్నపుడు ఇలాంటివి లేకుంటే కిక్కేముంటుంది?
శిల్పారెడ్డితో కలిసి చైతు-సామ్
స్పెయిన్
వెకేషన్లో
తమ
ఫ్యామిలీ
ఫ్రెండ్,
మోడల్
శిల్పారెడ్డితో
కలిసి
చైతూ,
సామ్.
చిల్లింగ్ అంటూ...
సమంత తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో చిల్లింగ్ అంటూ ఈ వైన్ గ్లాస్ ఫోటో పోస్టు చేసింది. దీన్ని బట్టి అక్కడ ఈ ప్రేమ జంట ఏ రేంజిలో చిల్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఎన్నడూ లేనంత ఆనందంగా
సమంత ఎన్నడూ లేనంత ఆనందంగా ఈ వెకేషన్లో కనిపించింది. తనకు ఇష్టమైన చైతన్య పక్కనుండటంతో పాటు.... ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా కూడా తమ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో భాగం కావడంతో పట్టలేని ఆనందంలో సమంత ఉన్నట్లు తెలుస్తోంది.
అఖిల్-చైతూ
స్పెయిన్‌లోని నైట్ కబ్ల్‌లో అక్కినేని యంగ్ బ్రదర్స్ నాగ చైతన్య, అఖిల్.
శిల్పారెడ్డి
అక్కినేని ఫ్యామిలీతో పాటు వెకేషన్లో ఉన్న శిల్పా రెడ్డి తన బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.