టాలీవుడ్ న్యూ కపుల్ సమంత-నాగ చైతన్య ప్రస్తుతం అమెరికాలో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. రెండు వారాల పాటు ఇక్కడ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఏప్రిల్ 6న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. పెళ్లి తర్వాత వీరు వెళ్లిన లాంగ్ వేకేషన్ ఇదే. దీంతో ఈ ట్రిప్ చై-సామ్ సెకండ్ హనీమూన్ అనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యువజంట అమెరికాలోని మియామీలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Samantha,Naga Chaitanya Went To U.S For Vacation
మియామీలో
మియామీలోని విన్‌వుడ్ వాల్స్‌లో గ్రాఫిటీ పెయింటింగ్ ముందుకు సమంత, చైతన్య ఫోటోలకు ఫోజులు ఇచ్చిన దృశ్యాన్ని సమంత టీమ్ అభిమానులకు షేర్ చేశారు. మియామీలో చూడదగ్గ ముఖ్య మైన ప్రదేశాల్లో విన్‌వుడ్ వాల్స్ ఒకటి. ఇది ఓ అవుట్ డోర్ మ్యూజియం లాంటిది.
సమయం దొరికింది కాబట్టే
పెళ్లి తర్వాత నుండి వరుస సినిమాల షూటింగులతో బిజీగా ఉన్న సమంత ఇటీవలే మూడు సినిమాల షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందుగానే ప్లాన్ చేసుకుని షూటింగులు ముగిసిన వెంటనే ఇద్దరూ అమెరికాలో ల్యాండ్ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇద్దరూ మళ్లీ షూటింగుల్లో బిజీ కానున్నారు.
A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Mar 27, 2018 at 4:40pm PDT
సమంత మూవీస్
సమంత నటించిన 'రంగస్థలం', 'మహానటి', 'ఇరుంబు తిరై' చిత్రాలు షూటింగ్ పూర్తయి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మార్చి 30న రంగస్థలం విడుదలవుతుండగా, మే 9న మహానటి విడుదల కానుంది. వెకేషన్ వెళ్లి వచ్చిన తర్వాత సామ్ తమిళ చిత్రాలైన సీమరాజా, సూపర్ డిలక్స్, తెలుగు మూవీ 'యూటర్న్' చిత్రాల షూటింగుల్లో జాయిన్ అవుతారు.
A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Mar 24, 2018 at 7:49am PDT
నాగ చైతన్య
నాగ చైతన్య ప్రస్తుతం ‘శైలజారెడ్డి అల్లుడు' సినిమాలో నటిస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘సవ్యసాచి' విడుదలకు సిద్ధమౌతోంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక.
పెళ్లయిన తర్వాత కలిసి చేస్తున్న మూవీ
పెళ్లయిన తర్వాత సమంత, చైతన్య కలిసి ఒకే సినిమాలో నటించలేదు. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఇద్దరూ కలిసి చేయబోతున్నారు. ఈ చిత్రానికి కంబైన్డ్ రెమ్యూనరేషన్ రూ. 7 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.
Samantha And Naga Chaitanya USA trip photos viral.In the picture posted by Samantha, she is seen standing next to her husband Naga Chaitanya and looks at him adorably. "Team," she captioned the post, adding a heart emoticon. They are currently in Miami and this is the first picture Samantha has posted with Naga Chaitanya from their trip.
Story first published: Thursday, March 29, 2018, 7:50 [IST]