ముసలమ్మ అయిన సమంత.. భార్యా భర్తల మజిలీ.. మామ నాగార్జునతో మజా! వెరీ ఇంట్రెస్టింగ్
తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ పాపులర్ జంటగా, హాట్ కపుల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నాగచైతన్య- సమంత. సినిమాల్లో, సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ హాట్‌గా కనిపించే ఈ జంటకు 2019 సంవత్సరం బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవాలి. ఇయర్ ఎండ్ సందర్బంగా ఓ సారి వారి సినిమాలు, ఆ జ్ఞాపకాలు గుర్తుచేసుకుందామా..

భార్యా భర్తలుగా మాంచి 'మజిలీ' చేశారు
పెళ్ళికి ముందే స్టార్ హీరో హీరోయిన్లుగా తెలుగు తెరపై గుర్తింపు తెరుచుకున్న చై సామ్ జోడీ.. పెళ్లి తర్వాత తొలిసారి ‘మజిలీ' సినిమాలో జంటగా నటించింది. ఈ సినిమాలో భార్యా భర్తలుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు నాగ చైతన్య- సమంత. దీంతో 2019 బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది 'మజిలీ' మూవీ.

యంగ్ లేడీ కాస్త ముసలమ్మ
ఇక సమంతకు 2019 చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ 32 ఏళ్ళ సుందరి 60 ఏళ్ళ ముసలమ్మగా మారి భలే కిక్కిచ్చింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఓ బేబీ' సినిమాతో సమంత సరికొత్త మ్యాజిక్ చేసింది. ఈ చిత్రంతో ఓరియెంటెడ్ పాత్రలు కూడా అలవోకగా చేయగలనని నిరూపించుకుంది సమంత.

మామ నాగార్జునతో మజా.. సూపర్
ఇక ఇదే ఏడాది అనగా ఆగస్టు నెలలో మామ నాగార్జునతోనూ తెరపంచుకొని హంగామా చేసింది సమంత. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన మన్మధుడు 2 సినిమాలో నాగార్జునతో కలిసి నటించింది. అదేవిధంగా సమంత నటించిన మరో సినిమా 'సూపర్ డీలక్స్' కూడా మంచి టాక్ తెచ్చుకుంది.

పెరిగిన నాగచైతన్య ఫ్యాన్ ఫాలోయింగ్
సోలోగా నాగచైతన్య విషయానికొస్తే.. సమంతతో పెళ్లయ్యాక హిట్ అనేదే లేని నాగ చైతన్యకు భార్య సమంత రూపంలోనే అదృష్టం కలిసొచ్చింది. మజిలీ సినిమా తర్వాత ఈ యంగ్ హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఆ సినిమాతో సక్సెస్ ఖాతాలో వేసుకున్న నాగచైతన్య ఇటీవలే మామ వెంకటేష్ సహకారంతో 'వెంకీమామ' రూపంలో మరో హిట్ సాధించాడు.

చైసామ్ జోడీ వెండితెర విందు.. 2020
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ స్టోరీలో నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి నటిస్తోంది. ఇక సమంత.. ముంబైలో ది ఫ్యామిలీ మేన్స్ సీజన్ 2 షూటింగ్‌లో పాల్గొంటోంది. మరికొద్ది రోజుల్లో మరోసారి చైసామ్ జోడీ వెండితెర విందు ఇవ్వనుందని తెలుస్తోంది. సో 2020 కూడా ఈ జోడీకి స్పెషల్ కావాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











