చైతూ జీవితంలో అనేక మంది అమ్మాయిలు: సమంత సంచలన కామెంట్స్!

By Bojja Kumar

సుశాంత్‌, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం 'చిలసౌ'. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్‌ 3న సినిమా విడుదలవుతుంది. సినిమాను ప్రమోట్ చేయడానికి అక్కినేని నాగ చైతన్య, సమంత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సామ్-చైతు క్లోజ్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్ వారి లవ్ స్టోరీ చెప్పాలని కోరడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైతు, సమంత, రాహుల్ మధ్య జరిగిన సంభాషణ క్రింది విధంగా సాగింది.

Recommended Video

Naga Chaitanya Says Good News To Their Fans
చైతు గురించి బ్యాడ్‌‌గా విన్నాను

చైతు గురించి బ్యాడ్‌‌గా విన్నాను

నాగ చైతన్య : 7 సంవత్సరాలుగా ఒకరికొకరం తెలుసు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత పెళ్లి చేసుకున్నాం. అప్పుడు నాకు సమంత తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు.

సమంత : బాబూ(చైతూ) నీ గురించి బయట చాలా బ్యాడ్‌గా విన్నాను... అందుకే అంత సమయం తీసుకున్నాను.

చైతు అబద్దాలు చెబుతున్నాడు

చైతు అబద్దాలు చెబుతున్నాడు

నాగ చైతన్య: మా లవ్ స్టోరీ చెప్పడానికి ఏమీ లేదు. 7 సంవత్సరాల నుండి ట్రై చేస్తూనే ఉన్నాను. ఫైనల్‌గా లాస్ట్ 2 ఇయర్స్ నా దారిలోకి వచ్చింది. బాగానే కష్టపడుతున్నాడు వీడు... ఒక ఛాన్స్ ఇవ్వొచ్చు అని సమంత నన్ను యాక్సెప్ట్ చేసింది.

సమంత: చైతూ పబ్లిక్‌గా చాలా అబద్దాలు చెబుతున్నాడు (నవ్వుతూ)

చైతూ జీవితంలో చాలా మంది అమ్మాయిలు

చైతూ జీవితంలో చాలా మంది అమ్మాయిలు

రాహుల్ రవీంద్రన్: జెస్సీ కూడా 2 గంటల్లో ఒప్పుకుంది.. సమంత 7 సంవత్సరాల సమయం తీసుకుందా? నువ్వేమో చాలా వెంట పడ్డాను కష్టపడ్డాను అంటున్నావ్... సామ్ కూడా నేను వెంటపడ్డాను, కష్టపడ్డాను అని చెప్పింది. ఇందులో ఏది నిజం? ఇద్దరూ కష్టపడ్డారు... మరి పెళ్లి జరుగడానికి అంత సమయం ఎందుకు పట్టింది?

సమంత: నేను చైతూ వెంట మాత్రమే పడ్డాను... కానీ అతడు చాలా మంది అమ్మాయిల వెంట పడ్డాడు (నవ్వుతూ).... 7 సంవత్సరాల తర్వాత నా టోకెన్ వచ్చింది.

పర్మినెంట్ టోకెన్ సమంతే...

పర్మినెంట్ టోకెన్ సమంతే...

రాహుల్ రవీంద్రన్: కానీ పర్మినెంట్ టోకెన్ సమంతే... మేమంతా చాలా హ్యాపీ. అంత మంది అమ్మాయిలు మీ జీవితంలో ఉన్నపుడు సమంతనే పెళ్లి చేసుకోవాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు.

అంత సీన్ లేదు బాబోయ్ అంటున్న చైతూ

అంత సీన్ లేదు బాబోయ్ అంటున్న చైతూ

నాగ చైతన్య: నా జీవితంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారనే విషయం నిజం కాదు. అంత సీన్ లేదు కూడా... సామ్ మసాలా వేసి చెబుతోంది. ఇద్దరం ఇష్ట పడ్డాం. మా రిలేషన్ షిప్‌ను మరో లెవల్‌కి తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాం.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్

లవ్ ఎట్ ఫస్ట్ సైట్

సమంత: నేను చైతును చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే తరహాలో ప్రేమలో పడిపోయాను. (వెంటనే చైతూ మైక్ అందుకుని.... అంతా అబద్దం)

సినిమా గురించి చైతూ...

సినిమా గురించి చైతూ...

చిలసౌ సినిమా గురించి చైతన్య మాట్లాడుతూ....ః. కథ వినగానే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఓ రాత్రిలో జరిగే కథ ఇది. ఇలాంటి కథ ఆడియెన్స్‌కు కనెక్ట్‌ అవుతుందా? అనే సందేహం ఉండేది. సమంత... నీది, రాహుల్‌ది సెన్సిబిలిటీస్‌ ఒకేలా ఉంటాయి. నువ్వు తనతో ఓ సినిమా చెయ్‌ అంది. సినిమా చూసిన తర్వాత తనతో సినిమా చేయడం సంగతి పక్కన పెడితే.. ఎలాగైనా ఈ సినిమాలో భాగం అయితే బావుండు అనిపించి నాన్నగారితో చెప్పాను. నాన్నగారు సినిమా చూశారు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. సినిమాలో సుశాంత్‌ చాలా కొత్తగా కనపడతాడు... అని తెలిపారు.

నా కళ్లలో నీళ్లు తిరిగాయి: సమంత

నా కళ్లలో నీళ్లు తిరిగాయి: సమంత

సమంత అక్కినేని మాట్లాడుతూ... '' నా కెరీర్‌ బిగినింగ్‌ నుండి ఈ స్టేజ్‌ వరకు రాహుల్‌ నాకు సపోర్ట్‌ అందిస్తూ వచ్చాడు. తనకు మంచి భవిష్యత్‌ ఉండాలని నేను ఆ దేవుడ్ని చాలా సార్లు ప్రార్థించాను కూడా. తను మంచి హార్డ్‌వర్కర్‌. ఈ సినిమాను తను చూడమనగానే.. భయపడుతూ చూశాను. ఎందుకంటే.. నా స్నేహితుడు యాక్టింగ్‌ను దాటి డైరెక్టర్‌ కావాలనుకుని ఆశగా చేసిన సినిమా. చూసిన తర్వాత ఏం చెప్పాల్సి వస్తుందోనని అనుకున్నాను. సినిమా చూస్తున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. రాహుల్‌ యాక్టర్‌గా నాకు కనెక్ట్‌ కాలేదు కానీ.. డైరెక్టర్‌గా కనెక్ట్‌ అయ్యాడు. కొత్త సుశాంత్‌ని తెరపై చూస్తారు... అని తెలిపింది.

రాహుల్ రవీంద్రన్

రాహుల్ రవీంద్రన్

దర్శకుడు మాట్లాడుతూ... ''పెళ్లిచూపుల్లోని అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు కరెక్టా? కాదా? అని ఓ అరగంటలో ఎలా నిర్ణయించుకుంటారు. దానికి ఎంత సమయం పడుతుంది? అనే కాన్సెప్ట్‌తో సాగే చిత్రమిది. పెళ్లే వద్దు అనుకునే అర్జున్‌, అంజలి జీవితం ఓ రాత్రిలో ఎలాంటి మలుపులు తిరిగాయనేది సినిమా కథాంశమని తెలిపారు.

సుశాంత్

సుశాంత్

‘‘ఇలాంటి ఒక మంచి కథతో సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. ఆడియెన్స్‌ హృదయాలను గెలుచుకుంటుందనే నమ్మకం ఉంది. కథను, మమ్మల్ని నమ్మి సినిమా చేసిన నిర్మాతలకు థాంక్స్‌'' అని సుశాంత్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X