గట్టిగా గొడవ పెట్టుకొంటాం.. చివరికి ఇలా ఫిక్స్.. వైరల్‌గా సమంత, చైతూ ఫొటో
మజిలీ సక్సెస్‌తో సమంత, నాగచైతన్య అక్కినేని మంచి జోష్‌లో ఉన్నారు. పెళ్లి తర్వాత వారిద్దరు కలిసి నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఈ సినిమాపై ప్రేక్షకులు, సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సానుకూలమైన సమయంలో సమంత, నాగచైతన్య ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. ఈ ఫొటో వెనుక కథే ఏమిటంటే...

భర్త ఒడిలో సేద తీరుతున్న సమంత
మజిలీ సినిమా భారీ సక్సెస్ వైపు దూసుకెళ్తున్న సమయంలో సమంత ఓ ఫొటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఫ్లయిట్‌లో నాగచైతన్య ల్యాప్‌టాప్‌లోకి దూరిపోయి టైమ్‌ను ఎంజాయ్ చేస్తుండగా.. భర్త ఒడిలో సేద తీరుతున్న క్షణాలను ఎవరో క్లిక్ మనిపించగా ఆ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకొన్నారు. చివరకు.. ఏమీ ఉండదు అంటూ నర్మగర్భంగా ఓ కామెంట్ పెట్టింది.

చైతూతో ఎనిమిదేళ్లు పట్టింది
మజిలీ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. చైతూ హృదయంలోకి వెళ్లడానికి ఎనిమిదేళ్లు పట్టింది. నేను బాగా ఇష్టపడిన సమయంలో ప్రేమను అంగీకరించడానికి ఆయన మానసికంగా సిద్ధంగా లేరు. మేమిద్దరం ఓ అవగాహనకు రావడానికి చాలా సమయం పట్టింది అంటూ సమంత చెప్పింది.

పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత
పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కూడా మేము పోట్లాడుకొంటాం. కానీ పెళ్లి తర్వాత నా కోపాన్ని నియంత్రించుకోవడం జరుగుతున్నది. మా మధ్య ఎంత గొడవ జరిగిన మరు నిమిషంలోనే కూర్చొని మాట్లాడుకుంటూ దానికి పరిష్కారం ఆలోచిస్తాం. హ్యాపీగా కలిసిపోతాం. చూసే వాళ్లకు వీళ్లు గొడవ పడుతారా అనే ఫీలింగ్ కలుగుతుంది అని సమంత అన్నారు.

అరుచుకోవడం ఉండదని
ఎవరి మధ్యనైనా గొడవలు, మనస్ఫర్థలు వస్తుండటం సహజం. దానిని మనసులో పెట్టుకొంటే అదీ మనకే నష్టం. మేము ఎంత పెద్ద గొడవ పెట్టుకొన్నప్పటికీ గట్టిగా అరుచుకొనే సందర్భాలే ఉండవు. ఒకరిపై మరొకరి అవగాహన ఉండటం వల్లే తొందరగా కలిసి పోతుంటాం. మంచైనా, చెడైనా మన చేతుల్లోనే ఉందని నమ్ముతాం అని సమంత చెప్పారు.

వెంకీ మామతో చైతూ
మజిలీ తర్వాత నాగచైతన్య వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నారు. తన మేనమామ విక్టరీ వెంకటేష్‌తో కలిసి నటించడం గమనార్హం. ఇక సమంత విషయానికి వస్తే, సూపర్ డీలక్స్, మజిలీ చిత్రాల తర్వాత 96 తెలుగు రీమేక్‌లో, అలాగే నందిని రెడ్డి చిత్రంలో సమంత నటించానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











