సమంత, నాగ చైతన్య వెడ్డింగ్ రిసెప్షన్ డేట్ ఖరారు
నాగ చైతన్య, సమంత వెడ్డింగ్ రిసెప్షన్ డేట్ ఖరారైంది. నవంబర్ 12వ తేదీన వేడుక జరుగనుంది.
Recommended Video

అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం అక్టోబర్ 6వ తేదీన గోవాలో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వేర్వేరుగా వీరి వివాహ వేడుక జరిగింది. పెళ్లయింది కానీ వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం పెట్టుకోలేదు. చైతన్య, సమంత తమ తమ సినిమాలతో బిజీగా ఉండటమే ఇందుకు కారణం.
ఇక ఈ పెళ్లి వేడుక పూర్తిగా ప్రైవేట్‌గా జరుడంతో గెస్టులను కూడా పరిమిత సంఖ్యలో పిలవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తన కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నారు.

వెడ్డింగ్ రిసెప్షన్ డేట్ ఖరారు
కాగా నాగ చైతన్య, సమంత వెడ్డింగ్ రిసెప్షన్ డేట్ ఖరారైంది. నవంబర్ 12వ తేదీన వీరి వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరూ ఈ తేదీన ఎలాంటి షూటింగులు లేకుండా ఫ్రీగా ఉండటంతో ఈ డేట్ ఫిక్స్ చేశారు.

సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖుల సమక్షంలో
నాగార్జున తన హోదాకు తగిన విధంగా ఈ వెడ్డింగ్ రిసెప్షన్ వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.

ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వేడుక
హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ నాగ చైతన్య-సమంతల వెడ్డింగ్ రిసెప్షన్ కు వేదిక కాబోతోంది. ఈ వేడుక కోసం ఆల్రెడీ ప్లానింగ్ మొదలైంది. అద్భుతమైన అలంకరణ, నోరూరించే వంటకాలతో అతిథులు ఆశ్చర్య పోయే విధంగా ఈ వేడుక జరుగబోతోందట.

హనీమూన్ ఎప్పుడుంటే..
నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత ఇంకా హనీమూన్ వెళ్లలేదు. ప్రస్తుతం తమ వర్క్ కమిట్మెంట్స్ వల్ల ఇద్దరూ తీరిక లేకుండా గడుపుతున్నారు. క్రిస్మస్ సీజన్లో హనీమూన్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. యూఎస్ఏతో పాటు యూరఫ్ దేశాల్లో వారు దాదాపు నెల రోజుల పాటు హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేయబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











