నాగచైతన్య-సమంత.. మరోసారి ప్రేమాయణం: ఈ ఫోటోలో భలే ఉన్నారే..
'ఏం మాయ చేశావె'తో ప్రేమలో పడ్డ నాగచైతన్య-సమంత.. పెళ్లి తర్వాత ఇప్పుడు మరో ప్రేమాయణానికి సిద్దమయ్యారు. 'నిన్ను కోరి'తో హిట్ కొట్టిన శివ నిర్వాణ దర్శకత్వంలో వీరిద్దరు ఓ లవ్ స్టోరీలో నటించనున్నారు. పెళ్లి తర్వాత చై-సామ్ కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.
ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో భాగంగా.. ఇటీవల వీరిద్దరు కలిసి కారులో బయలుదేరిన ఫోటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'సినిమా కోసం కలిసి వెళ్తున్నాం. థ్యాంక్స్' అని అందులో పేర్కొంది. ఓ కొత్త ప్రకటన కూడా చేయబోతున్నామని వెల్లడించింది. ఫోటోలో నవ్వులు చిందిస్తున్న ఈ జోడీ చూడ ముచ్చటగా ఉందంటున్నారు నెటిజెన్స్.

ఇదిలా ఉంటే, సమంత-రాంచరణ్ కాంబినేషన్ లో సుకుమార్ దర్శకుడిగా తెరకెక్కిన 'రంగస్థలం' ఈ నెల 30న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. అటు నాగచైతన్య 'సవ్యసాచి' కూడా త్వరలోనే విడుదలకు సిద్దమవుతోంది.


Click it and Unblock the Notifications











