twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చాలా తక్కువే..... నాగ చైతన్య-సమంత గోవా పెళ్లి ఖర్చు అంతేనా?

    సమంత-చైతు వివాహానికి అంతా సిద్ధమైంది. గోవాలో అక్టోబర్ 6, 8 తేదీల్లో వేడుక జరుగనుంది.

    By Bojja Kumar
    |

    Recommended Video

    Nagachaitanya Samantha wedding Budget Details Here పెళ్లి ఖర్చు అంతేనా?

    టాలీవుడ్ ప్రేమజంట నాగ చైతన్య, సమంత మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో ఏకం కాబోతున్నారు. గోవాలో వీరి వివాహ వేడుకకు ఏర్పాట్లు అన్నీ సిద్ధం అయ్యాయి. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుండి గెస్టులు ఇప్పటికే గోవా చేరుకున్నారు.

    చైతన్య హిందూ, సమంత క్రిస్టియన్ కావడంతో రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుక జరుగబోతోంది. ఒకరి సాంప్రదాయాలను ఒకరు గౌరవించుకుంటూ రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహ వేడుక జరుగబోతోంది.

     రామానాయుడు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ 100 మంది

    రామానాయుడు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ 100 మంది

    ఓ ఆంగ్లపత్రికతో నాగార్జున మాట్లాడుతూ... ఇది చాలా సింపుల్ గా జరుగుతన్న పెళ్లి వేడుక, క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ను మాత్రమే ఆహ్వానించాం. రామానాయుడు గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి 100 మంది మా తరుపున ఈ పెళ్లి వేడుకకు హాజరవుతున్నారు అని తెలిపారు. సమంత తరుపు నుండి కూడా చాలా తక్కువ మందే హాజరవుతారని సమాచారం.

     పెళ్లి ఖర్చు

    పెళ్లి ఖర్చు

    గోవాలో జరుగుతున్న నాగ చైతన్య-సమంత పెళ్లి వేడుక ఖర్చు రూ. 10 కోట్లకు మించదని, ఈ ఖర్చు అక్కినేని కుటుంబం స్థాయికి తగినది కాక పోయినా.... చైతన్య, సమంత చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఇలా ప్లాన్ చేశారు.

     లావిష్ రిసెప్షన్

    లావిష్ రిసెప్షన్

    పెళ్లి వేడుక అతి కొద్ది మంది సమక్షంలో జరుగుతున్నా.... రిసెప్షన్ లావిష్ గా జరుపాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత చైతు, సమంత షూటింగుల్లో బిజీ అవ్వనున్నారు. వారికి అనువుగా ఉండేలా త్వరలోనే రిసెప్షన్ డేట్ డిసైడ్ చేసి చెబుతాను అని నాగార్జున వెల్లడించారు.

     హనీ మూన్ అప్పుడే...

    హనీ మూన్ అప్పుడే...

    పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంత తమ తమ సినిమా షూటింగుల్లో బిజీ కానున్నారు. క్రిస్ మస్, న్యూఇయర్ సందర్భంగా వెకేషన్ వెళ్లేందుకు ప్లాన్ చేసకుంటున్నారు. ఓ ఆంగ్లపత్రికతో సమంత మాట్లాడుతూ... తమకు ఇపుడు సమయం లేదని, క్రిస్ మస్, న్యూఇయర్ సందర్భంగా షూటింగ్ మధ్యలో బ్రేక్ తీసుకుని హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమంత తెలిపారు.

     చైతు గ్రాండ్ మదర్ చీర ధరించనున్న సమంత

    చైతు గ్రాండ్ మదర్ చీర ధరించనున్న సమంత

    రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుక జరుగుతుండటంతో హిందూ సాంప్రదాయంలో జరిగే పెళ్లి వేడుకలో సమంత.... నాగ చైతన్య గ్రాండ్ మదర్ చీరను ధరించనుంది. దీంతో పాటు భారీగా నగలు ధరించనుంది.

     క్రిస్టియన్ వెడ్డింగ్

    క్రిస్టియన్ వెడ్డింగ్

    క్రిస్టియన్ వెడ్డింగ్ కోసం ప్రత్యేకంగా డ్రెస్సులు డిజైన్ చేయించుకుంది. ఇందుకు సంబంధించిన డ్రెస్సులను ప్రముఖ డిజైనర్ క్రేషా బజాజ్ డిజైన్ చేస్తున్నారు.

    English summary
    Samantha Ruth Prabhu and Naga Chaityana met on the sets of 2010 film Ye Maaya Chesaveand fell in love, and now they are getting married. However, media reports that the much anticipated destination wedding in Goa is being organised with a budget of Rs. 10 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X